సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘జైలర్’ సినిమా నుంచి మొదటి పాటను నిర్మాతలు విడుదల చేశారు. ‘వా నువ్వు కావాలయ్యా... నువ్వు కావాలయ్యా...’ అంటూ ఈ సాగే పాట పెప్పీగా వినబుల్‌గా ఉంది. తమన్నా సూపర్ స్టెప్పులతో ఆకట్టుకుంది. మధ్యలో రజినీకాంత్ మార్కు మేనరిజంతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు.



ఇండిపెండెన్స్ డే వీకెండ్ సందర్భంగా ఆగస్టు 10వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అనిరుథ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయి పోయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలియజేస్తూ పలు ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.


రజినీ కాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో  మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కూడా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. వీరితో పాటు హిందీ నటుడు జాకీ ష్రాఫ్, తెలుగు నటుడు సునీల్, రమ్య కృష్ణ, తమన్నా,  వినాయకన్, మిర్నా మీనన్, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్, కిషోర్, బిల్లీ మురళీ, సుగుంతన్, కరాటే కార్తీ, మిథున్, అర్షద్, మరిముత్తు, నమో నారాయణ, రిత్విక్, అనంత్, శరవణన్, అరంతాంగి నిషా, మహానటి శంకర్, కలై అరసన్ కూడా ఈ సినిమాలో నటించనున్నారు.