Chiranjeevi ANR Award: చిరంజీవికి అక్కినేని అవార్డు... అమితాబ్ చేతుల మీదుగా - ANR100 ప్రెస్‌మీట్‌లో ప్రకటించిన నాగార్జున

ANR 100th Birthday: అక్కినేని నాగేశ్వరరావు వందో జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని అవార్డు ఇస్తున్నట్లు నాగార్జున వెల్లడించారు.

Continues below advertisement

ANR National Award in his centenary birth year will be awarded to MEGASTAR Chiranjeevi: పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి అతి త్వరలో చేరనుంది. తెలుగులో తొలి తరం అగ్ర హీరోలలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఇచ్చే పురస్కారం ఆయన్ను వరించనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

చిరంజీవికి ఏయన్నార్ అవార్డు!
అక్కినేని నాగేశ్వర రావు (Akkineni Nageswara Rao) పేరిట ప్రతి ఏడాది ఆయన కుటుంబం అవార్డు ఇవ్వడం ఆనవాయితీ. ఈ మధ్య రెండేళ్లకు ఒకసారి ఆ అవార్డు ఇస్తున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలోని వివిధ భాషల్లో చిత్రసీమ ఉన్నతికి కృషి చేసిన ప్రముఖులకు ఇస్తారు. ప్రతి ఏడాది ఇచ్చే అవార్డుతో పోలిస్తే ఈ ఏడాది అవార్డుకు కాస్త ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకు అంటే... అక్కినేని శత జయంతి సంవత్సరంలో ఇస్తున్న అవార్డు ఇది. తెలుగు చిత్రసీమ ఉన్నతికి కృషి చేయడంతో పాటు తనదైన నటన, సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నందుకు చిరంజీవికి దక్కిన పురస్కారంగా భావించవచ్చు.

మెగాస్టార్ చిరంజీవిని ఈ ఏడాది అక్కినేని అవార్డు (ANR Award 2024)తో సత్కారం చేస్తున్నామని ఆయన వందో జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో కింగ్ అక్కినేని నాగార్జున అనౌన్స్ చేశారు. అవార్డు గురించి చెప్పగానే చిరంజీవి చాలా ఎమోషనల్ అయ్యారని, తనను హగ్ చేసుకుని థాంక్స్ చెప్పారని ఆయన వివరించారు.

Also Read: ప్రభాస్ లేడు... కానీ షూటింగ్ మొదలెట్టిన హను రాఘవపూడి - ఎక్కడో తెలుసా?

అవార్డు ఎప్పుడు ఇస్తారు? అతిథి ఎవరు?
అక్టోబర్ 28న హైదరాబాద్ సిటీలోని ప్రముఖ హోటల్‌లో జరిగే కార్యక్రమంలో చిరుకు ఏయన్నార్ అవార్డు ఇవ్వనున్నారు. ఆ వేడుకకు ముఖ్య అతిథిగా లెజెండరీ బాలీవుడ్ నటుడు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు నాగార్జున వివరించారు. అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు ఆ వేడుకకు హాజరు అవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Also Readఎన్టీఆర్ ఫ్యాన్స్ తడిగుడ్డ వేసుకుని పడుకోవచ్చు - 'దేవర' పగిలిపోయింది

అక్కినేని, కొణిదెల కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. సినిమాలకు అతీతంగా చిరంజీవి, నాగార్జున ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటారు. ఆ అనుబంధం తర్వాతి తరంలోనూ కంటిన్యూ అవుతోంది. రామ్ చరణ్, అఖిల్ అక్కినేని మధ్య స్నేహం ఉంది. వీటన్నిటికీ మించి అక్కినేని అవార్డు చిరుకు, అదీ శత జయంతి సంవత్సరంలో వస్తుండటం విశేషం అని చెప్పాలి.

Continues below advertisement