టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ (Sekhar Master), జానీ మాస్టర్ (Jani Master) పేర్లు తప్పకుండా ఉంటాయి. పాన్ ఇండియా సినిమాలకే కాదు... హిందీ, తమిళ్, కన్నడ సినిమాల్లో పాటలకూ కొరియోగ్రఫీ చేస్తున్నారు. అయితే... ఆ ఇద్దరి మధ్య జరిగిన గొడవ చర్చకు దారి తీసింది. తెలుగు సినిమా టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) జనరల్ బాడీ మీటింగ్‌లో ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకుంటూ వాగ్వాదానికి దిగడం, పోలీసుల జోక్యం చేసుకోవడం తెలుగు చిత్రసీమలో సంచలనం సృష్టించింది.

Continues below advertisement

అసలు గొడవ ఏమిటి? కారణం ఏమిటి?డ్యాన్సర్ అసోసియేషన్ ఎన్నికలు, మెంబర్షిప్ అంశాలు గొడవకు కారణమని వైరల్ అయిన వీడియోల ద్వారా తెలుస్తోంది. ఫెడరేషన్ అనుమతి లేకుండా బై ఎలక్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం అగ్గి మీద ఆజ్యం పోసినట్టు అయ్యింది. జానీ మాస్టర్ భార్య సుమలత, టీఎఫ్‌టీడీడీఏ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని ఆరోపిస్తూ పది మంది డ్యాన్సర్లు రాజీనామా చేశారని టాక్. జానీ, సుమలత దంపతులపై ఆరోపణలు చేస్తూ బషీర్ మాస్టర్ ఓ వీడియో విడుదల చేశారు.

సమస్యను పరిష్కరించిన చిరంజీవి!డ్యాన్సర్స్ అసోసియేషన్ గొడవ తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి... ఇద్దరినీ తన దగ్గరకు పిలిపించుకున్నారు. ప్రస్తుతం బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో సినిమా చేస్తున్న ఆయన... ఆ సెట్స్‌లో మాస్టర్స్ ఇద్దరితో మాట్లాడారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించారు.

Continues below advertisement

సోమవారం సాయంత్రం శేఖర్ మాస్టర్, తనకు మధ్య ఎటువంటి గొడవలు లేవని జానీ మాస్టర్ మీడియా ముందుకు వచ్చారు. తామిద్దరం ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములమని పేర్కొన్నారు. ఫేక్ వైరల్ వీడియోలు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు. తమ మధ్య ఉన్న సమస్యలు తొలగిపోయాయని తెలిపారు.

Also Read: Lenin Box Office Collection Day 4 - అయ్యగారి జోరు తగ్గిందా? 'లెనిన్' మండే కలెక్షన్లు ఎలా ఉన్నాయ్? నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయ్?

జానీ మాస్టర్ మాట్లాడుతూ... ''సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలా? వద్దా? అనేది డిస్కస్ చేసేందుకు వచ్చాం. కొన్ని విషయాలపై చర్చించుకున్నాం. కొన్ని వీడియోలు పట్టుకుని నాకు, శేఖర్ మాస్టర్‌కి గొడవ జరిగిందంటూ ప్రచారాలు చేశారు. అవన్నీ ఫేక్. శేఖర్ మాస్టర్, బాను మాస్టర్... అందరూ మంచి వ్యక్తులు. మేం ఎవరికి ఎవరూ శత్రువులం కాదు. అందరికి అందరం సపోర్ట్‌గా ఉంటాం'' అని చెప్పారు.

Also Read: Korean Kanakaraju Teaser Review - కొరియన్ కనకరాజు టీజర్ రివ్యూ: కొరియా దెయ్యం పెనుకొండకు వస్తే? సత్యతో వరుణ్ కామెడీ కుమ్మిందిగా

చిరంజీవి గురించి జానీ మాస్టర్ మాట్లాడుతూ... ''వైరల్ వీడియోలు చూసి చిరంజీవి గారు కూడా మాతో మాట్లాడారు. శేఖర్ మాస్టర్ గారు, నేను, చిరంజీవి గారు కలిసి ఆనందంగా మాట్లాడుకున్నాం. కలిసి భోజనం చేశాం. మాలో ఎలాంటి గొడవలు లేవు. మాకు చిరంజీవి గారితో పాటు మన హీరోలు అందరూ సపోర్ట్ చేస్తుంటారు. టాలెంట్ ఉన్నవారిని మన హీరోలు ఎంకరేజ్ చేస్తారు. ఈ సందర్భంగా చిరంజీవి గారికి థాంక్స్ చెబుతున్నాం. మేమంతా ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన డ్యాన్స్, ఆయన సినిమాలు, ఫైట్స్ చూసే ఇక్కడకు వచ్చాం. మనకు డ్యాన్స్ అంటే చిరంజీవి గారే'' అని చెప్పారు. 

Also Read: Don't Trouble The Trouble Teaser - డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ టీజర్ రివ్యూ: నవ్వుల మేజిక్... ఫాంటసీ కథతో ఫహద్ ఫాజిల్ సినిమా