Chiranjeevi and Pawan Kalyan At Ayodhya: కోట్లాది మంది భారతీయుల కల నేడు నిజమైంది. 550 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత రామమందిరం ప్రారంభోత్సవానికి శ్రీకారం పడింది. నేడు అయోధ్యలో దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు, వేలాది మంది భక్తుల మధ్య మధ్య కన్నుల పండుగగా అయోధ్య రామ మందిరంకు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని రామ మందిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ రజనీకాంత, బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తదితర సినీ పెద్దలు హాజరై వేడుకను స్వయంగా వీక్షించారు. అలాగే సినీ రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


అయోధ్య జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబం సందడి చేసింది. ఆలయ ప్రారంభోత్సోవానికి చిరంజీవికి వీఐపీ ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఈ మేరకు భార్య సురేఖ, తనయుడు మెగాపవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాదు మిగతా మెగా ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్టకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి, సురేఖ, రామ్‌ చరణ్‌ల ఫొటోలు సోషల్‌ మీడియాలో బయటకు వచ్చాయి. అంతేకాదు జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కూడా పాల్గొన్నారు.






రామ మందిరం ప్రారంభ వేడుక జరుగుతుండగా పవన్‌ సెల్ఫీ తీసుకుని తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. ఈ మేరకు చిరంజీవి ఫ్యామిలీ ఫొటోతో పాటు పవన్‌ ఫొటో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే శ్రీరామ జన్మభూమి ఉద్యమానికి శ్రీకారం చుట్టిన బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ మాత్రం ప్రాణప్రతిష్ఠకు దూరంగానే ఉండిపోయారు. జనవరి 22వ తేదీ 2024 మద్యాహ్నం 12.30 గంటల దివ్య ముహూర్తాన ప్రధాని మోదీ చేతుల మీదుగా రామమందిరం ప్రారంభ వేడుక జరిగింది. ఈ ఆలయం ప్రారంభోత్సవానికి దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు చాలామందికి ఆహ్వానాలు అందాయి.






అయితే రామమందిర ఉద్యమానికి తెరలేపిన బీజేపీ కురువృద్దులు మాజీ హోంమంత్రి ఎల్‌కే అద్వానీ, విశ్వ హిందూపరిషత్ నేత మురళీ మనోహర్ జోషిలు మాత్రం ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. వయసు రిత్యా వయస్సు రీత్యా, ఆరోగ్య కారణాల రీత్యా ఈ ఇద్దరినీ రావద్దని శ్రీ రామజన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ కోరింది. దాంతో దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగడంతో విశ్వ హిందూపరిషత్ కలుగజేసుకుని ఈ ఇద్దరినీ ప్రత్యేకంగా ఆహ్వానించింది. వయస్సు , ఆరోగ్య రీత్యా ఈ ఇద్దరికీ ప్రత్యేక ఏర్పాట్లు చేశామని విశ్వ హిందూ పరిషత్ తెలిపింది. కానీ, వారు కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తోంది. 


Also Read: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన 'కలర్‌ ఫొటో' హీరో భార్య - బిడ్డను పరిచయం చేసిన సుహాస్..