సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) జీవితంలో బైక్ యాక్సిడెంట్ ఓ భారీ కుదుపు అని చెప్పాలి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో ఒక్కసారిగా బ్రేకులు వేసింది. దానిని ఓ గుణపాఠంగా భావిస్తానని ఆయన పేర్కొంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముద్దుల మేనల్లుడిగా సాయి ధరమ్ తేజ్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. 


ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్ ఆస్పత్రిలో ఉంటే పవన్ కళ్యాణ్ వెంటనే, ఆఘమేఘాల మీద ఆస్పత్రికి వెళ్లారు. ఆ తర్వాత 'రిపబ్లిక్' సినిమా వేడుకలో తన మేనల్లుడు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో ఉంటే, కొందరు చేసిన ప్రచారం బాధ కలిగించిందని కాస్త ఆవేశంగా మాట్లాడారు. మరి, ఆ బైక్ / రోడ్ యాక్సిడెంట్ తర్వాత మేనల్లుడితో చిరంజీవి ఏం చెప్పారు? ఆయన ఏం అన్నారు? అనేది లేటెస్ట్ ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు. 


ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి!  
సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన 'విరూపాక్ష' శుక్రవారం (ఈ నెల 21న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆయన ప్రింట్, వెబ్ మీడియాతో ముచ్చటించారు. అప్పుడు యాక్సిడెంట్ ప్రస్తావన వచ్చింది. చిరు ఏమన్నారు? అని ప్రశ్నించగా... 


Chiranjeevi message to Sai Dharam Tej : ''జీవితం అంటే కష్టాలు వస్తాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్లడమే జీవితం. కష్టాలను, బాధలను చూసి మనం భయపడకూడదు. బాధపడకూడదు. యాక్సిడెంట్ తర్వాత చిరంజీవి గారు 'ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి. ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి' అంటూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలోని లైన్లు నాకు పంపించారు'' అని సాయి ధరమ్ తేజ్ తెలిపారు. 


ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్ వ్యక్తిత్వంలో మార్పు వచ్చిందని చాలా మంది చెప్పే మాట. ఆయన మాటల్లో ఎక్కువ ఫిలాసఫీ కనబడుతోందని చిత్ర పరిశ్రమ ప్రముఖులు, 'విరూపాక్ష' ప్రచార కార్యక్రమాలను ఫాలో అవుతున్న మెగా ఫ్యాన్స్, ఆడియన్స్ చెబుతున్నారు. ఇంటర్వ్యూలోనూ సాయి ధరమ్ తేజ్ మాటల్లో ఫిలాసఫీ కనిపించింది. 


జీవితం అంతా సవాళ్ళే!  
తన జీవితం అంతా సవాళ్లతో నిండిందని సాయి ధరమ్ తేజ్ వ్యాఖ్యానించారు. తాను ఎప్పుడూ కొత్త సవాళ్లను స్వీకరించేందుకు సిద్దంగా ఉంటానని ఆయన తెలిపారు. సవాళ్లు లేకుంటే జీవితం చప్పగా అనిపిస్తుందన్నారు.


Also Read : యాక్సిడెంట్ తర్వాత అమ్మే మళ్ళీ నాకు మాటలు నేర్పింది - సాయి ధరమ్ తేజ్ ఇంటర్వ్యూ


హీరోగా తన ఇమేజ్ గురించి కూడా సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ చేశారు. ''నాకు మాస్ ఇమేజ్ వచ్చిందని, లార్జర్ దెన్ లైఫ్‌ కారెక్టర్ వచ్చిందని అసలు ఎప్పుడూ అనుకోలేదు. మంచి సినిమాలు, మంచి కారెక్టర్లు చేయాలనుకునే సినిమాలు ఎంపిక చేసుకుంటున్నా. అలాగే చేస్తూ వస్తున్నాను. ఏదో ఒక ఇమేజ్ వస్తుందని ఇంత వరకు నేను ఏ సినిమా చేయలేదు. 'విరూపాక్ష' మిస్టిక్ థ్రిల్లర్. ఈ తరహా చిత్రాలకు సపరేట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. అయితే, ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది'' అని సాయి ధరమ్ తేజ్ వివరించారు. 


Also Read రవితేజ & శర్వానంద్ - ఓ మల్టీస్టారర్, ఎక్స్‌క్లూజివ్ డీటెయిల్స్