Child Artist Shreshtha about Manchu Manoj: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాల్లో రాణించిన వారు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా తమ సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. ఆ లిస్ట్‌లో తేజ సజ్జా లాంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు. అయితే చైల్డ్ ఆర్టిస్టులుగా పేరు తెచ్చుకున్న తర్వాత సినీ పరిశ్రమకు దూరమయిన వారు కూడా ఉన్నారు. దానికి బెస్ట్ ఉదాహరణ శ్రేష్ఠ. ఒకప్పటి స్టార్ హీరోలు అందరితో శ్రేష్ఠ సినిమాలు చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలాకాలం వరకు టాలీవుడ్‌లో బిజీ కెరీర్‌ను చూసింది. కానీ ఉన్నట్టుండి ఇండస్ట్రీ వద్దనుకొని వెళ్లిపోయింది. ఇన్నాళ్ల తర్వాత ఒక ఇంటర్వ్యూ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో మంచు మనోజ్‌తో పెళ్లి ప్రపోజల్ గురించి బయటపెట్టింది.


రిజెక్ట్ చేశాను..


మోహన్ బాబు, ఎన్‌టీఆర్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన ‘మేజర్ చంద్రకాంత్’లో పలువురు చైల్డ్ ఆర్టిస్టులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించారు. అందులో శ్రేష్ఠ కూడా ఒకరు. అలా మోహన్ బాబుతో, తన ఫ్యామిలీతో శ్రేష్ఠకు అనుబంధం ఏర్పడింది. అదే సినిమాలో మనోజ్ కూడా ఒక చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. అలా చిన్నప్పటి నుండే శ్రేష్ఠకు, మనోజ్‌కు మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. అయితే శ్రేష్ఠ మీద ఇష్టంతో మంచు మనోజ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని మోహన్ బాబు నిర్ణయించుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా అదే విషయంలో క్లారిటీ ఇచ్చింది శ్రేష్ఠ. మోహన్ బాబు నేరుగా వచ్చి తన తల్లిదండ్రులతో మనోజ్‌తో పెళ్లి విషయం మాట్లాడారని బయటపెట్టింది. తనకు ఆ ప్రపోజల్ ఇష్టం లేదని, అందుకే రిజెక్ట్ చేశానని క్లారిటీ ఇచ్చింది. కానీ ఎందుకు రిజెక్ట్ చేసిందో మాత్రం సమాధానం చెప్పలేదు.


అందుకే వెళ్లిపోయాను..


ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్టుల నుంచి హీరోహీరోయిన్లుగా మారగా.. తను మాత్రం అన్నీ వదిలేసి అమెరికా ఎందుకు వెళ్లిపోయిందో బయటపెట్టింది శ్రేష్ఠ. ‘‘ఒకరు ఒక మాట అనడం వల్లే అన్నీ వదిలేసి వెళ్లిపోయాను. సినిమాల్లో చేసే అమ్మాయి అంటూ తక్కువగా చేసి చూశారేంటి అనే ఫీలింగ్ వచ్చింది’’ అంటూ దాని గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడలేదు శ్రేష్ఠ. ఒకవేళ తనకు మళ్లీ సినిమాల్లో అవకాశం వచ్చినా చేయాలనే ఆలోచన పెద్దగా లేదని బయటపెట్టింది. మంచి క్యారెక్టర్, తనకు సూట్ అయ్యే పాత్ర అయితే ఆలోచిస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అన్నీ వదిలేసి తన ఫ్యామిలీ బిజినెస్ అయిన కన్‌స్ట్రక్షన్‌లో బిజీ అయిపోయానని తెలిపింది.


అమెరికా వెళ్లను..


ప్రస్తుతం తను ఇండస్ట్రీ నుంచి దూరంగానే ఉంటున్నా.. ప్రస్తుతం నటీనటుల్లో కొందరు మాత్రం సోషల్ మీడియాలో టచ్‌లో ఉన్నారని చెప్పుకొచ్చింది శ్రేష్ఠ. తను ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో కూడా కొన్ని చిన్న సినిమాల్లో కొత్త నటీనటులకు డబ్బింగ్ చెప్పానని గుర్తుచేసుకుంది. ఇక ప్రస్తుతం పెళ్లిపై తన అభిప్రాయం అడగగా.. తాను ఒకత్తే కూతురినని, తనకు అన్నీ అమెరికా సంబంధాలు వస్తున్నాయని చెప్పుకొచ్చింది శ్రేష్ఠ. అమెరికా ఇష్టం లేదు కాబట్టే వచ్చేశానని, మళ్లీ అక్కడికే వెళ్లడం తనకు అస్సలే ఇష్టం లేదని క్లారిటీ ఇచ్చింది. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంత గుర్తింపు తెచ్చుకున్నా.. ఇప్పుడు శ్రేష్ఠను చాలావరకు ప్రేక్షకులు మర్చిపోయారు.


Also Read: స్పిరిట్‌ మూవీ అప్‌డేట్‌ - ప్రభాస్‌ కోసం తెరపైకి ముగ్గురు హీరోయిన్ల పేర్లు? సందీప్‌ ఫోకస్‌ ఆమెపైనేనట!