Senior actor Chandra Mohan died today : సీనియర్ నటులు, కథనాయకులు చంద్ర మోహన్ ఇక లేరు. ఈ రోజు ఉదయం ఆయన కన్ను మూశారు. భాగ్య నగరం (హైదరాబాద్ సిటీ)లోని ప్రముఖ ఆస్పత్రి అపోలో 9 గంటల 45 నిమిషాలకు హృద్రోగంతో తుదిశ్వాస విడిచారు. 


Chandra Mohan Age : ప్రస్తుతం చంద్ర మోహన్ వయసు 82 సంవత్సరాలు. ఆయనకు ఓ భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేశారు. ఉన్నారు. సోమవారం హైదరాబాద్ సిటీలో అంత్యక్రియలు నిర్వహిస్తారని చంద్ర మోహన్ కుటుంబ సభ్యులు తెలిపారు. 


చంద్ర మోహన్ పూర్తి పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. ఆయన మే 23, 1943లో జన్మించారు. కృష్ణాజిల్లాలోని పమిడి ముక్కల గ్రామం ఆయన స్వస్థలం. బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో చంద్ర మోహన్  డిగ్రీ పూర్తి చేశారు. కళాతపస్వి కె. విశ్వనాథ్, చంద్రమోహన్ బంధువులు. దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, ప్రముఖ నిర్మాత శివలింగ కృష్ణ ప్రసాద్ సైతం చంద్రమోహన్ చుట్టాలే.


Chandra Mohan First Movie : బి.ఎన్.రెడ్డి దర్శకత్వం వహించిన 'రంగులరాట్నం' సినిమాతో చంద్రమోహన్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు నటుడిగా పరిచయం అయ్యారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వాణిశ్రీ ప్రధాన పాత్రలలో నటించిన 'సుఖ దుఃఖాలు' సినిమాతో చంద్రమోహన్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు హిట్ సినిమాలు చేశారు. హీరోగా కూడా చంద్రమోహన్ పలు విజయవంతమైన సినిమాలు చేశారు. 


Also Read పెళ్లి తర్వాత వరుణ్ తేజ్, లావణ్య హాజరైన ఫస్ట్ ఫంక్షన్ ఇదే - ఎందుకో తెలుసా?


'పదహారేళ్ళ వయసు', 'సిరిసిరిమువ్వ', 'జీవన తరంగాలు', 'మీనా', 'ఓ సీత కథ', 'సెక్రటరీ', 'శంకరాభరణం' తదితర చిత్రాల్లో చంద్రమోహన్ నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి సీనియర్ కథానాయకులతో పాటు ఆ తర్వాత తరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తదితర హీరోలతో కూడా చంద్రమోహన్ సినిమాలు చేశారు. ఈతరం హీరోలైన మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్, విష్ణు మంచు, రామ్, రవితేజ, గోపీచంద్, మనోజ్  కూడా నటించారు.


ఉత్తమ హాస్యనటుడిగా 'చందమామ రావే' సినిమాకు గాను 1987లో చంద్రమోహన్ నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తరువాత మరోసారి 'అతనొక్కడే' సినిమాకు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరో నంది సొంతం చేసుకున్నారు. మొత్తం మీద చంద్రమోహన్ 6 నంది పురస్కారాలను అందుకోవడం విశేషం. రాష్ట్ర పురస్కారాల కంటే ముందు పదహారేళ్ళ వయసు సినిమాకు గాను చంద్రమోహన్ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. చంద్ర మోహన్ మరణం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.ఆయనను కడసారి చూసేందుకు చిత్రసీమ, ప్రముఖులు ఆస్పత్రికి వెళుతున్నారని తెలిసింది.


Also Read : జపాన్ రివ్యూ : వాటీజ్ థిస్ కార్తీ - స్లాంగ్ బావుంది సార్, మరి సినిమా?