బాలీవుడ్ ప్రేక్షకులకు సెలీనా జైట్లీ తప్పకుండా తెలిసే ఉంటారు. 'నో ఎంట్రీ'తో పాటు 'గోల్ మాల్ రిటర్న్స్', 'థాంక్యూ' వంటి సినిమాల్లో ఆవిడ నటించారు. ఫెమినా 'మిస్ ఇండియా' (2001) విన్నర్ కూడా. 'మిస్ యూనివర్స్'లో నాలుగో రన్నరప్. ఇక తెలుగు సినిమాలకు వస్తే... డేరింగ్ అండ్ డ్యాషింగ్ స్టార్ విష్ణు మంచు 'సూర్యం'లో కథానాయికగా నటించారు. ఇప్పుడీ అందాల భామ సంసార జీవితంలో సమస్యలు తలెత్తాయి. భర్తపై ఆవిడ డొమెస్టిక్ వయలెన్స్ (గృహ హింస) కేసు నమోదు చేశారు.
విడాకుల దిశగా సెలీనా జైట్లీ అడుగులు!
సెలీనా జైట్లీ నవంబర్ 24, 1981న జన్మించారు. ఆవిడ వయసు 43 ఏళ్ళు. తన పుట్టినరోజు నాడు వైవాహిక జీవితం గురించి సెలీనా జైట్లీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రియాలో 2011లో పీటర్ హాగ్, సెలీనా జైట్లీ వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటున్నారు. సెలీనా జైట్లీ ఇంట్లో ఏమైందో ఏమో... తన పట్ల క్రూరంగా ప్రవరిస్తున్నారని, సంసార జీవితంలో మోసం చేస్తున్నారని ముంబై కోర్టులో గృహ హింస చట్టం కింద కేసులు పెట్టారు. దాంతో పీటర్ హాగ్ (Celina Jaitly Husband Peter Haag)కు కోర్టు నోటీసులు జారీ చేసింది.
Also Read: రాముడిగా నటిస్తూ మటన్ తింటావా? వెజిటేరియన్‌గా మారడం అబద్ధమేనా? రణబీర్‌పై పబ్లిక్ ఫైర్
భర్తపై కేసు పెట్టిన విషయాన్ని సోషల్ మీడియాలో సెలీనా జైట్లీ ధృవీకరించారు. తాను నమ్మిన వ్యక్తులు తన జీవితం నుంచి వెళ్లిపోయారని, తనకు చేసిన ప్రామిస్ నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. బహుశా భర్తను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసినట్టు ఉన్నారు. తన కేసు కోర్టు పరిధిలో ఉన్నది కనుక ఎక్కువ మాట్లాడలేనని తెలిపారు. అదే సమయంలో తాను సైనికుడి కుమార్తెను అని, తనకు ధైర్యంగా ఉండటం తెలుసు అని వివరించారు. హ్యాష్ ట్యాగ్స్ గనుక గమనిస్తే... 'డివోర్స్' (విడాకులు) అని కూడా ఉంది. భర్త నుంచి వేరు పడాలని ఆవిడ డిసైడ్ అయినట్టు ఉన్నారు.