CBFC Rejects Certification To Yogi Adityanath Biopic Ajey The Untold Story Of Yogi: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి' మూవీకిి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిరాకరించింది. రవీంద్ర గౌతమ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా... సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదంటూ సీబీఎఫ్‌సీ వెల్లడించింది. దీంతో దర్శక నిర్మాతలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సీఎం బయోపిక్‌కు సర్టిఫికెట్ ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు.

సీబీఎఫ్‌సీకిి కోర్టు ప్రశ్నలు

ఈ మూవీలో యోగి ఆదిత్యనాథ్ పేరును అజయ్ మోహన్ సింగ్‌గా మార్చారు. ఆయన రోల్‌లో అనంత్ జోషి నటించారు. యోగి గురువు మహంత్ పాత్రలో పరేష్ రావల్ నటించారు. దర్శక నిర్మాతల పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన క్రమంలో కోర్టు సీబీఎఫ్‌సీపై ప్రశ్నల వర్షం కురిపించింది. గత 8 ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉన్న నవల ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించామని టీం కోర్టుకు నివేదించింది. పుస్తకంపై ఎలాంటి అభ్యంతరాలు లేనప్పుడు దాని ఆధారంగా తెరకెక్కించిన మూవీకి సెన్సార్ ఎందుకు నిరాకరించారో తెలపాలంటూ బోర్డును కోర్టు ఆదేశించింది.

పుస్తకంలో ఎలాంటి సమస్యలు లేవని... ఎటువంటి నెగిటివిటీ సృష్టించనప్పుడు ఈ సినిమా ఎలా నెగిటివిటీ చూపిస్తుందని సర్టిఫికెట్ ఆపారంటూ జస్టిస్ రేవతి మోహితే డిరే, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన ధర్మాసనం బోర్డును ప్రశ్నించింది. మరోవైపు, సీబీఎఫ్‌సీ సభ్యులు మూవీ కూడా చూడకుండా కేవలం ట్రైలర్‌ను మాత్రమే చూసి సర్టిఫికెట్ రిజెక్ట్ చేశారని దర్శక నిర్మాతల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ బోర్డును కోర్టు ఆదేశించింది.

Also Read: 'కింగ్డమ్' కలెక్షన్స్... విజయ్ దేవరకొండ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్? మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?