Catherine In Megastar Anil Ravipudi Movie: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబో మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాలో ఇతర యాక్టర్స్, హీరోయిన్స్ గురించిన అప్ డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ సైతం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. 

ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్

ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ కేథరిన్ (Catherine) ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుండగా.. చిరంజీవి సరసన హీరోయిన్లుగా వీళ్లే నటించబోతున్నారంటూ చాలామంది పేర్లు వినిపించాయి. ఇప్పుడు తాజాగా కేథరిన్ హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. 

టాలీవుడ్‍‌లో 2013 నుంచి మూవీస్ చేస్తున్న కేథరిన్.. అల్లు అర్జున్ 'సరైనోడు' సినిమాలో ఎమ్మెల్యేగా నటించి మెప్పించారు. ఆ తర్వాత బింబిసార, మాచర్ల నియోజకవర్గం, వాల్తేరు వీరయ్య తదితర మూవీస్‌లో నటించి తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు ఏకంగా చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేశారని.. ఇది అదృష్టమేనని ఫిలింనగర్ వర్గాల టాక్. మరి దీనిలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

Also Read: ప్రతీ క్షణం భయం భయం.. ప్రాణాలతో చెలగాటం - హిట్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' సీజన్ 3 వచ్చేస్తోంది.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

మెగాస్టార్ సరసన స్టార్ హీరోయిన్

'మెగా 157' ప్రకటన వచ్చినప్పటి నుంచీ ఓ ప్రత్యేక బజ్ నెలకొంది. సాధారణంగా ఏదైనా మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చిందంటేనే రూమర్స్ హల్చల్ చేస్తుంటాయి. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన సీనియర్ హీరోయిన్ నయనతార నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఓ రోల్ కోసం ఆమె రూ.18 కోట్లు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుండగా.. మూవీ టీం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే సౌత్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్‌గా ఆమె పేరు నిలిచిపోతుంది. ఇప్పటికే మెగాస్టార్ 'గాడ్ ఫాదర్'లో ఆయనకు చెల్లెలిగా నటించారు నయనతార. అలాగే, సైరా నరసింహారెడ్డిలోనూ నటించారు.

సిస్టర్‌గా ఆ హీరోయిన్?

ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవికి సిస్టర్ రోల్ ఉందని.. అది చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ రోల్‌లో సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించనున్నారనే టాక్ నడుస్తోంది. మరి దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే, ఓ కీలక రోల్ కోసం విక్టరీ వెంకటేష్ సైతం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం ప్రస్తుతం అనిల్ తన టీంతో కలిసి విశాఖలో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో చిరంజీవి అసలు పేరు శివ శంకర్ వరప్రసాద్ అని అనిల్ రావిపూడి ఇటీవలే తెలిపారు. 'రా' ఏజెంట్‌గా మెగాస్టార్ కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కమాండో చీఫ్ కింద కనిపిస్తారనేది మరో టాక్. త్వరలోనే హీరోయిన్స్, ఇతర యాక్టర్స్‌పై పూర్తి అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది.