Prakash Raj faces Legal Action Over His Comments On Ramayana : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. రామాయణం, భారతదేశంలోని సామాజిక పరిస్థితులపై ఆయన చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... రామలక్ష్మణులు వలస కూలీలని కామెంట్స్ చేశారు.
ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే?
'రామలక్ష్మణులు దక్షిణాదిలో ఓ పొలంలోకి ప్రవేశించి పండ్లను దొంగిలించి తిన్నారు. ఆ పొలం యజమాని గిరిజనుడైన రావణుడు. పండ్ల దొంగతనంపై ప్రశ్నించడంతో వివాదం పెద్దదైంది. GSTతో కలిపి 2 వేల డాలర్లు కట్టాలని శూర్పణఖ చెప్పింది.' అంటూ ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో కాంట్రవర్శీ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా... ఆయన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. సోషల్ మీడియాలోనూ ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
శ్రీరాముడు ఉత్తరాదికి చెందినవాడని... రావణుడు దక్షిణాదికి చెందినవాడని కామెంట్ చేశారు ప్రకాష్ రాజ్. ఎవరినీ ఏదీ చేయాలంటూ ఫోర్స్ చెయ్యకూడదంటూ సెటైరికల్‌గా పురాణ గాథలను వక్రీకరిస్తూ మాట్లాడారంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, గిరిజనలు హక్కులు, మైనారిటీల స్థితిగతుల గురించి కూడా తీవ్ర కామెంట్స్ చేశారు.
Also Read : 'ఎట్టా ఎట్టా' అదరగొట్టిన అఖిల్, భాగ్యశ్రీ జోడీ - లెనిన్ విలేజ్ లవ్ సాంగ్ క్యూట్ లిరిక్స్
కేసు నమోదు
ప్రకాష్ రాజ్ కామెంట్స్‌పై పోలీసులకు వరుసగా ఫిర్యాదులు అందాయి. పలు హిందూ సంఘాల ఫిర్యాదు మేరకు ఆయనపై వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. మతపరమైన మనోభావాలు కించపరిచారని, సమాజంలో విధ్వేషాలు రెచ్చగొట్టేలా కామెంట్ చేశారంటూ ఆయనపై కొన్ని సంఘాల వారు మండిపడుతున్నారు. ఆయన్ను అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి.
గతంలోనూ ప్రకాష్ రాజ్ పలు అంశాలపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడగా... వివాదానికి దారితీశాయి. ఈసారి ఏకంగా రామాయణం, సున్నితమైన అంశాలపైనే సెటైరికల్‌గా మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఎవరి నమ్మకాలు వారివని... కోట్లాది మంది దేవుడిలా భావించే రామునిపై అవహేళనగా మాట్లాడడం సరికాదంటూ నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు.
