నుష్ బర్త్ డే సందర్భంగా మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం కెప్టెన్ మిల్లర్ టీజర్ వచ్చేసింది. రాకీ, సానికాయిదం లాంటి సినిమాలు తీసిన అరుణ్ మతీశ్వరన్, ధనుష్ కలిసి చేస్తున్న మొదటి సినిమా కావటంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అరుణ్ స్టైల్ లో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇస్తున్నట్లు ఫస్ట్ లుక్ లోనే అర్థం కాగా.. ఇప్పుడు విడుదలైన టీజర్ తో అది మరింత పీక్స్‌కు వెళ్లింది.


సినిమాల్లో క్యారెక్టర్ పరంగా వేరియేషన్స్ చూపించేందుకు ఏమాత్రం ఆలోచించని ధనుష్ ఈ సినిమాలోనూ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ టీజర్‌లో ఓ రెండు విషయాలపైనే ఎక్కువగా కాన్సస్ట్రేషన్ కనిపించింది ఆ రెండే గుడి, గన్స్. టీజర్ మొత్తం తుపాకులే కనిపించాయి. ధనుష్ తో మొదలుపెట్టి హీరోయిన్ ప్రియా అరుల్ మోహన్, స్పెషల్ రోల్ చేస్తున్న సందీప్ కిషన్, ఇంకా మిగిలిన నటులు అందరి చేతుల్లోనూ గన్స్ ఉన్నాయి. కన్నడస్టార్ శివరాజ్ కుమార్ కూడా రివల్యూషనరీ తరహా స్క్రీన్ అప్పీరియెన్స్ లోనే కనిపించారు. అయితే టీజర్ లో ఈ గన్నులు ఎక్కువ కనపడటానికి కారణం ఏమిటనే విషయంపై పోస్టర్‌లోనే క్లూ ఇచ్చారు. 


ధనుష్‌కు ఈ మూవీలో మూడు పేర్లు మిల్లర్, ఈశ, అనలీశ అని ఉంది ఈ పోస్టర్‌లో. సన్నగా డార్క్ స్కిన్‌తో ఉండే మిల్లర్ డెకాయిట్ అని, మర్డరర్ అని రాసి ఉంది. పట్టిచ్చిన వారికి నగదు బహుమతిని కూడా అందులో ప్రకటించారు. ఈ పోస్టర్ వేసింది బ్రిటీషర్స్ అనీ, ధనుష్ ఓ ముఠాను మెయింటెన్ చేస్తూ బ్రిటీషర్లపైనే దాడులు చేస్తూ వాళ్ల నుంచే ఆయుధాలు దొంగిలిస్తున్నాడనీ అర్థం చేసుకోవచ్చు. అందుకే టీజర్ చివర్లో ఓ పెద్ద బెటాలియన్ తో ధనుష్, అతని మనుషులపై అటాక్ చేయించటానికి బ్రిటీషర్స్ వస్తున్నట్లు చూపించారు. ధనుష్ టీమ్ కూడా వాళ్లపై అటాక్ చేయడాన్ని టీజర్‌లో చూడవచ్చు. 


మరి ధనుష్ బ్రిటీష్ పోలీసుల నుంచి ఆయుధాలను దొంగిలించి వారిపైనే ఎందుకు పోరాడుతున్నాడు. స్వాతంత్ర్యం ముందు కథ కాబట్టి ధనుష్ కెప్టెన్ మిల్లర్ గా మారి బ్రిటీషర్లను దేశం నుంచి తరిమేసే యోధుడిగా పోరాడుతున్నాడా.. లేదా వేరే ఏదైనా కథ ఉందా చూడాలి. ఇక రెండో రిఫరెన్స్ టెంపుల్. టీజర్ లో చాలా ఎక్కువ సార్లు టెంపుల్ కనిపించింది. సార్పట్ట సినిమాలో విలన్ వేటపులిగా నటించిన జాన్ కొక్కేన్ రోజ్ కెప్టెన్ మిల్లర్ లోనూ నెగటివ్ రోల్ చేసినట్లున్నారు. టెంపుల్ లో అతను వెకిలిగా నవ్వుతున్నట్లు చూపించిన షాట్.. టెంపుల్ లోనే ఎవరినో చంపటానికి హీరోయిన్ ప్రియా అరుల్ మోహన్ ట్రై చేస్తున్నట్లు గన్ తో చూపించిన షాట్.. టెంపుల్ బయట అప్పటి సైన్యం, పోలీసులు కాపలా ఉన్నట్లు చూపించిన షాట్.. ఈ బ్రిటీషర్ ఫేస్ పక్కన నుంచి టెంపుల్ చూపించటం.. ధనుష్ స్లమ్స్ లో ఉంటున్నట్లు చూపించిన షాట్.. సో ఇది ఊరిలో ఆధిపత్యం, ఎక్కువ, తక్కువ కులం తరహా పాయింట్‌లా అర్థమవుతోంది. ఆ టైమ్ లో అస్పృశ్యత లాంటివి ఉండేవి కాబట్టి..బ్రిటీషర్స్ అండ్ అస్పృశ్యత...ఈ రెండు పాయింట్స్ లనూ కెప్టెన్ మిల్లర్ గా ధనుష్ చూపించనున్నారేమో చూడాలి. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా డిసెంబర్ 15న రిలీజ్ కానుంది.


Also Read నన్ను వదిలేయండి, ప్రభాస్ మీద కామెంట్ చేయలేదు - 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial