టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా హ్యాకర్ల బారిన పడ్డారు. ప్రభాస్ అధికారిక ఫేస్బుక్ పేజ్ తాజాగా హాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రభాస్ తన ఇన్ స్టా స్టోరీ ద్వారా తెలియజేశారు. గురువారం సాయంత్రం ప్రభాస్ ఫేస్బుక్ ఖాతాలో ఓ వీడియో వైరల్ గా మారింది. అందులో 'మనుషులు దురదృష్టవంతులు' అనే క్యాప్షన్ తో ఉన్న వీడియో ఉండడంతో ఈ వీడియోని చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ప్రబాస్ ఏంటీ అలాంటి వీడియో పెట్టారని షాకయ్యారు. ఆయన ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయిందంటూ ట్వీట్టర్ ద్వారా అలర్ట్ చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రభాస్ సోషల్ మీడియా టీం సమస్యను పరిష్కరించింది.
అయితే మొదటగా ప్రభాస్ ఫేస్బుక్ హ్యాక్ అయిందని తెలియడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఆ తర్వాత ప్రభాస్ టీమ్ దాన్ని సాల్వ్ చేయడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రభాస్ కి ఫేస్బుక్‌లో 24 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సుమారు 11 ఏళ్ల క్రితం ఫేస్ బుక్ లోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చారు డార్లింగ్. ఇక తన ఫేస్ బుక్ లో కేవలం ప్రభాస్ డైరెక్టర్ రాజమౌళి మాత్రమే ఫాలో అవుతున్నారు. ఇక ఈ పేస్ బుక్ ఖాతాని ప్రభాస్ కేవలం ముఖ్యమైన విషయాలను షేర్ చేసుకోడానికి మాత్రమే వినియోగిస్తాడు. అంటే తన సినిమా విశేషాలు, కానీ నటీ, నటులకు బర్త్డే విషెస్ చెప్పేందుకు ప్రభాస్ సోషల్ మీడియాలో తన ఫేస్బుక్ ఖాతాని ఉపయోగిస్తారు. ఇక మరోవైపు ప్రభాస్ కి ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలు కూడా ఉండగా పేస్ బుక్ లోనే ప్రభాస్ ని ఎక్కువ మంది ఫాలో అవుతుండడం విశేషం.
ఇన్ స్టా గ్రామ్ లో ప్రభాస్ కి 10 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ట్విట్టర్ లో 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అదే ఫేస్ బుల్ లో ఏకంగా 24 మిలియన్ల మంది ఫాలోవర్స్ తో ప్రభాస్ టాప్ ప్లేస్ కో ఉన్నారు. కాగా ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్గా 'ఆదిపురుష్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ సినిమాతో మరోసారి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని నిరాశపరిచాడు. దీంతో ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ 'సలార్', :కల్కి 2898AD' సినిమాల పైనే ఉన్నాయి. ఇందులో 'కే జి ఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ తెరకెక్కిస్తున్న 'సలార్' సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అనూహ్య స్పందన వచ్చింది.
త్వరలోనే మూవీ టీం మరిన్ని అప్డేట్స్ తో రాబోతోంది. ఈ క్రమంలోనే ముందుగా ఆగస్టులో 'సలార్' ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కే' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి 'కల్కి 2898AD'అనే పేరుని ఖరారు చేస్తూ గ్లిమ్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అమితాబచ్చన్, దీపిక పదుకొనే, కమల్ హాసన్, దిశా పటాని లాంటి అగ్రతారలు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇవే కాకుండా మారుతి సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో 'స్పిరిట్' సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.
Also Read : 'ఆదిపురుష్' హీరోయిన్ సరికొత్త వ్యాపారం - ఆమె ప్రొడక్ట్స్ రేట్ ఎంతో తెలుసా?