యువ కథానాయకుడు ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni), సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న లేటెస్ట్ సినిమా 'ది వారియర్'. ఆల్రెడీ ఇందులో 'బుల్లెట్...' సాంగ్ విడుదల అయ్యింది. ఇప్పుడు ఆ పాట మంచి దూకుడు మీద ఉంది. యువ తమిళ హీరో, క్రేజీ స్టార్ శింబు ఆ పాటను పాడిన సంగతి తెలిసిందే.
'బుల్లెట్...' సాంగ్‌కు యూట్యూబ్‌లో మంచి దూకుడు మీద ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఆ పాటకు 60 మిలియన్ ప్లస్ వ్యూస్ (The Warriorr Movie - Bullet Song Records) వచ్చాయి. అంటే... ఆరు కోట్లకు పైమాటే అన్నమాట. దేవిశ్రీ ట్యూన్, శింబు వాయిస్‌కు రామ్, వేసిన స్టెప్పులు తోడు కావడంతో ప్రేక్షకులు విపరీతంగా పాటను చూస్తున్నారు. హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) అందం కూడా యాడ్ అయ్యింది. యూట్యూబ్ గ్లోబల్ టాప్ మ్యూజిక్ ఛార్ట్స్‌లో కూడా 'బుల్లెట్...' సాంగ్ చోటు దక్కించుకుంది.
సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో 'బుల్లెట్...' సాంగ్‌ను తెరకెక్కించారని దర్శకుడు లింగుస్వామి (Lingusamy) తెలిపారు. నిర్మాత ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదని ఆయన పేర్కొన్నారు. సినిమాలో 'బుల్లెట్...' సాంగ్ విజువల్స్ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తాయని యూనిట్ టాక్.
Also Read: పాకిస్తానీ సినిమాకు Cannes 2022లో అవార్డులు - 'జాయ్ ల్యాండ్' ప్రత్యేకత ఏంటి?
Also Read: 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?