Bubblegum movie censorship formalities completed: సుమ కనకాల యాంకరింగ్ ఇంటిల్లిపాది చూసేలా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించేలా... అందమైన మాటలతో యాంకరింగ్ చేయడం ఆమెకు మాత్రమే సొంతం. సుమకు ఫ్యామిలీ, హోమ్లీ ఇమేజ్ ఉంది. వాళ్ళబ్బాయి సినిమాకు చిన్న పిల్లలను తీసుకుని ఫ్యామిలీస్ రావడం కష్టమే.
'బబుల్ గమ్'కు సెన్సార్ నుంచి 'ఎ' సర్టిఫికెట్!
Bubblegum censored with A: ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ దంపతుల తనయుడు రోషన్ కనకాల కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'బబుల్ గమ్'. 'క్షణం', 'కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రాలలో ఆకట్టుకున్న రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించిన చిత్రమిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో రోషన్ కనకాల సరసన తెలుగు అమ్మాయి మానస చౌదరి కథానాయికగా నటించింది. డిసెంబర్ 29న ఈ సినిమా విడుదల కానుంది.
Also Read: ఛాంబర్‌లో 'దిల్' రాజు దగ్గర సంక్రాంతి సినిమాల పంచాయతీ - డుమ్మా కొట్టిన 'హనుమాన్' నిర్మాత
'బబుల్ గమ్' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్ లభించింది. అంటే... పెద్దలకు మాత్రమే అన్నమాట. 'ఇదొక జెన్జీ లవ్ స్టోరీ' అని దర్శక నిర్మాతలు, చిత్ర బృందం ముందు నుంచి చెబుతూ వస్తుంది. అంటే... ఈ తరం యువతీ యువకుల ప్రేమ కథ అంటే ముద్దు ముచ్చట కామన్ కదా! టీజర్, ట్రైలర్ చూస్తే హీరో హీరోయిన్ల మధ్య ముద్దులు ఉన్నాయి.
'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలను ఈతరం యువత విపరీతంగా చూసింది. ఆ సినిమా విజయాలకు ముద్దులు అడ్డుకాలేదు. సో... ఈ సినిమా కూడా విజయం సాధించి ఆ సినిమాల జాబితాలో చేరుతుందని ఆశిద్దాం.
Also Read: వేణు స్వామి ఎక్కడ? - ప్రభాస్ కెరీర్ కష్టం అన్నాడే, హిట్ రాదని చెప్పాడే!
రోషన్ కనకాల, మానస చౌదరి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు ఇతర ప్రధాన తారాగణం. 'పిఎస్వి గరుడవేగ', 'తెల్లవారితే గురువారం', 'ఆకాశవాణి' చిత్రాలకు పనిచేసిన సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ కాగా... మలయాళ సినిమా 'తల్లుమల' ఫేమ్, కేరళ స్టేట్ అవార్డ్ విన్నర్ నిషాద్ యూసుఫ్ ఎడిటర్.
ఈ చిత్రానికి రచన: రవికాంత్ పెరేపు, విష్ణు కొండూరు, సెరి-గన్ని, నిర్మాణ సంస్థలు: మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ప్రొడక్షన్ డిజైన్: శివమ్ రావు, స్క్రీన్ ప్లే కన్సల్టెంట్: వంశీ కృష్ణ, క్రియేటివ్ ప్రొడ్యూసర్: దివ్య విజయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మధులిక సంచన లంక, దర్శకత్వం: రవికాంత్ పెరేపు.