రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) జంటగా నటించిన సినిమా 'బ్రహ్మాస్త్ర' (Brahmastra Movie). ఇదొక సినిమా మాత్రమే కాదు... దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రణ్‌బీర్, ఆలియా ఏడడుగులు వేయడానికి కారణమైన చిత్రమిది. ఈ సినిమాకు ముందు వాళ్ళు ప్రేమికులు కూడా కాదు. సినిమా విడుదల సమయానికి ఆలియాను రణ్‌బీర్ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ కూడా!
దర్శకుడు అయాన్ ముఖర్జీ పదేళ్లు కష్టపడి తీసిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున చాలా రోజుల విరామం తర్వాత నటించిన హిందీ సిన్మా ఇది. వీటన్నిటికీ మించి కరణ్ జోహార్ ఎంతో నమ్మకం పెట్టుకున్న సినిమా. నేను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది.
బాలీవుడ్ స్టార్ హీరోలు ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. రణ్‌బీర్ కపూర్ సైతం 'షంషేరా'తో ఫ్లాప్ అందుకున్నారు. మరోవైపు బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్. వీటన్నిటి మధ్య 'బ్రహ్మాస్త్ర' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో జోరు చూపించింది.
Also Read : 'బ్రహ్మాస్త్ర' సినిమాను ఎందుకు చూడాలంటే?
అడ్వాన్స్ బుకింగ్స్, ప్రేక్షకుల్లో సినిమాపై క్రేజ్ చూసి... హిందీ హీరోల ఫ్లాపుల పరంపరకు 'బ్రహ్మాస్త్ర' బ్రేక్ వేస్తుందని బాలీవుడ్ ఆశిస్తోంది. మరి, సినిమా ఎలా ఉంది? నెటిజన్లు సినిమా గురించి ఏమంటున్నారు? ఒక లుక్ వేయండి. సినిమా హిట్టో ఫట్టో తెలుసుకోండి.
Also Read : 'ఒకే ఒక జీవితం' రివ్యూ : టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ & మదర్ సెంటిమెంట్ శర్వాకు హిట్ ఇచ్చాయా?
Brahmastra First Review: దుబాయ్ క్రిటిక్ ఉమైర్ సంధు సెన్సార్ జరిగేటప్పుడు తాను సినిమా చూస్తానని చెబుతుంటారు. ఆయన 'బ్రహ్మాస్త్ర' చూశానని తెలిపారు. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ సినిమాకు కేవలం 2.5 రేటింగ్ మాత్రమే ఇచ్చారు. వీఎఫ్ఎక్స్ హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయని, కొన్ని సీక్వెన్సులు బావున్నాయని ఉమైర్ సందు పేర్కొన్నారు.
తెలుగులో 'బ్రహ్మాస్త్రం' పేరుతో ఈ సినిమాను విడుదల చేశారు. ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్ సిటీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, బెంగుళూరు నగరాల్లో కూడా బుకింగ్స్ బావున్నాయి.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత హిందీ సినిమా ఇండస్ట్రీలో వారసులపై కొంత మంది ప్రేక్షకుల్లో వ్యతిరేక భావం ఉంది. స్టార్ కిడ్స్ నటించిన సినిమాలు వచ్చినప్పుడు బాయ్ కాట్ చేయమంటూ పిలుపు ఇస్తున్నారు. 'బ్రహ్మాస్త్ర' సినిమాను కూడా బాయ్ కాట్ చేయమన్నారు. సోషల్ మీడియా నుంచి ఆ బాయ్ కాట్ ట్రెండ్ పబ్లిక్‌లోకి రావడం ఆందోళన కలిగించింది.
రణ్‌బీర్, ఆలియాతో పాటు 'బ్రహ్మాస్త్ర' దర్శకుడు అయాన్ ముఖర్జీ మంగళవారం ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్ళినప్పుడు కొంత మంది నిరసనకారులు నల్ల బ్యాడ్జీలు ధరించి స్వాగతం పలికారు. 'బ్రహ్మాస్త్ర'ను విడుదల చేయకూడదని డిమాండ్ చేశారు. దాంతో దర్శనం కాకుండా చిత్ర బృందం వెనుదిరగాల్సి వచ్చింది.