Bollywood star hero In Rajinikanth and Lokesh Kanagaraj’s film : గత ఏడాది 'జైలర్' సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో బాలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో తన 171వ సినిమా చేస్తున్నాడు. అనౌన్స్మెంట్ నుంచి వీరిద్దరి కాంబినేషన్ ప్రాజెక్టుపై కోలీవుడ్లో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరోలతో ఓ సినిమాటిక్ యూనివర్సల్ క్రియేట్ చేసి దర్శకుడిగా భారీ క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ రజినీకాంత్ తో సినిమా చేస్తున్నాడు అనగానే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్టు కోసం ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది.


రజినీకాంత్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో


లోకేష్ కనగరాజ్ రజినీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో ఓ ముఖ్య పాత్ర ఉందట. ఆ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటిస్తున్నట్లు తాజా సమాచారం. సినిమాలో రజినీకాంత్ రోల్‌కు సమానంగా ఆ పాత్ర ఉండడంతో లోకేష్ ఆ రోల్‌ను ఓ స్టార్ హీరోతో చేయించాలని అనుకున్నాడట. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా రణవీర్ సింగ్ తో లోకేష్ సంప్రదింపులు కూడా జరపగా.. రణవీర్ సింగ్ రజినీకాంత్ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపించినట్లు తెలిసింది. త్వరలోనే మేకర్స్ నుంచి దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందని ఇన్సైడ్ వర్గాల సమాచారం.


షారుఖ్ ఖాన్ స్థానంలో రణ్ వీర్ సింగ్


రజినీకాంత్ సినిమాలో రణవీర్ సింగ్ చేయనున్న పాత్ర కోసం మొదట షారుక్ ఖాన్ ని అనుకున్నారట లోకేష్ కనగరాజ్. ఈ మేరకు షారుక్‌ను సంప్రదించగా ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్ చేసేందుకు ఆసక్తి లేక ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు. ఇప్పుడు అదే షారుక్ ఖాన్ చేయాల్సిన పాత్రని రణవీర్ సింగ్ తో చేయించబోతున్నట్లు టాక్.


జూన్‌లో సెట్స్ మీదకి


లోకేష్ కనగరాజ్ - రజినీకాంత్ కాంబినేషన్ మూవీ జూన్‌లో సెట్స్ మీదికి వెళ్ళనుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నఈ సినిమాని ఈనెల 22న గ్రాండ్ గా లాంచ్ చేయడంతో పాటు అదే రోజు టైటిల్ని కూడా రివీల్ చేయనున్నట్లు సమాచారం. ఈసారి తన సినిమాటిక్ యూనివర్స్ కి కాస్త దూరంగా కంప్లీట్ ఫ్రెష్ స్టోరీతో రజినీకాంత్ మూవీని తెరకెక్కిస్తున్నాడు లోకేష్ కనగరాజ్. ఈ మూవీలో రజినీకాంత్ మాఫీయా డాన్‌గా కనిపించనున్నారు ఈ సినిమా గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగనున్నట్లు సమాచారం. సింగపూర్ అమెరికా దుబాయ్ లాంటి దేశాల నుంచి ఇండియాకి గోల్డ్ స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది అనే పాయింట్ తో మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.


Also Read : రష్మిక బర్త్ డే ట్రీట్ - 'ది గర్ల్ ఫ్రెండ్' ఫస్ట్ లుక్ రిలీజ్, ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటున్న 'యానిమల్' బ్యూటీ!