సినీ ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ సెలబ్రిటీస్ ముందు వరుసలో ఉన్నారని చెప్పొచ్చు. టాలీవుడ్ తో పోల్చుకుంటే చాలామంది బాలీవుడ్ స్టార్స్ సినిమాలు యాడ్స్ కాకుండా సోషల్ మీడియా ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకొని అభిమానులతో టచ్ లో ఉండడం, సినిమా అప్డేట్స్ అందించడంతో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ కోసం ఇన్ స్టాగ్రామ్ ని ఉపయోగిస్తున్నారు.


అలా ఓ బాలీవుడ్ సెలెబ్రిటీ ఇన్ స్టాగ్రామ్ లో ఒక్కో పోస్ట్ కి ఏకంగా మూడు కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకొని బాలీవుడ్ లోనే సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో తన అందం, అభినయంతో అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు హాలీవుడ్ లోనూ తన నటనతో అదరగొట్టింది. ఆమె మరెవరో కాదు ప్రియాంక చోప్రా. ముంబై మీడియా సమాచారం ప్రకారం... ఇన్ స్టాగ్రామ్ లో 89.4 మిలియన్ ఫాలోవర్స్  ఉన్న ప్రియాంక చోప్రా ఒక్కో పోస్ట్ కి మూడు కోట్లు సంపాదిస్తుందట. షారుక్ ఖాన్ రూ. 80 లక్షల నుండి కోటి రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.


ఆలియా భట్ కోటి రూపాయలు, శ్రద్ధా కపూర్ రూ.1.18 కోట్లు, దీపికా పదుకొనే రూ.1.5 కోట్లు చార్జ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే షారుఖ్, దీపిక లాంటి పాపులర్ స్టార్స్ ను మించి ప్రియాంక చోప్రా భారీ రెమ్యునరేషన్ అందుకోవడం విశేషం. ఇక ఇటీవల ప్రియాంక చోప్రా అమెరికన్ వెబ్ సిరీస్ సిటాడెల్'(Citadel) లో తన యాక్షన్ ప్యాకెడ్ పెర్ఫార్మెన్స్ తో ఫాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత మరో అమెరికన్ మూవీ 'లవ్ ఎగైన్'(Love Again) లో సామ్ హ్యూగమ్ తో జోడి కట్టి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ప్రస్తుతం 'హెడ్స్ ఆఫ్ స్టేట్'(Heads oF State) మూవీ షూటింగ్ తో బిజీగా ఉంది. ఈ మూవీలో ఇద్రీస్ ఎల్బా, జాన్ సేన తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది ప్రియాంక చోప్రా.


Also Read టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?


వర్క్ కమిట్మెంట్స్ వల్ల రీసెంట్ గా జరిగిన తన కజిన్ పరిణితి చోప్రా పెళ్లికి హాజరు కాలేకపోయింది ప్రియాంక చోప్రా. పరిణితి వివాహానికి ఆమె కచ్చితంగా హాజరవుతుందని అందరూ భావించారు. కానీ ఆ సమయంలో ప్రియాంక ఇండియాలో లేకపోవడం, షూటింగ్ తో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయింది.


ఈ విషయంలో ఆమె ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. మరోవైపు ప్రియాంక చోప్రా కేవలం హాలీవుడ్ లోనే కాదు తాజాగా 'జిలే జరా'(Jee Lee Zara) అనే బాలీవుడ్ మూవీ లోనూ నటిస్తోంది. ఫర్హాన్ అక్టర్ దర్శకత్వం వహించిన ఈ మూవీని 2019 లోనే ప్రకటించారు. కానీ ప్రియాంక చోప్రా డేట్స్ సమస్యల వల్ల ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ మూవీలో ప్రియాంక చోప్రా తో పాటు ఆలియా భట్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది చివర్లోనే సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Also Read : 'చంద్రముఖి 2' కోసం లారెన్స్ రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ - ఎన్ని కోట్లో తెలుసా?





Join Us on Telegram: https://t.me/abpdesamofficial




Also Read :