సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, బ్రేకప్, విడాకులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ముఖ్యంగా ఈ జనరేషన్ లో ఇవి కాస్త ఎక్కువైపోయాయి. బాలీవుడ్లో అయితే చాలామంది సెలబ్రిటీలు అలా ప్రేమించుకుని ఇలా బ్రేకప్ చెప్పుకోవడం అక్కడితో ఆగకుండా కొత్త భాగస్వామిని వెతుక్కోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. సెలబ్రిటీల మధ్య బ్రేకప్స్ టాలీవుడ్‌తో పోల్చుకుంటే బాలీవుడ్లోనే ఎక్కువ. ఈ బ్రేకప్స్ వల్ల చాలామంది స్టార్ సెలబ్రిటీలు సైతం వార్తల్లో నిలుస్తూ వచ్చారు. కొన్ని కొన్ని సార్లు స్టార్ సెలబ్రిటీల బ్రేకప్స్ ఎంతో కాంట్రవర్షియల్‌గా మారుతూ ఉంటాయి. అభిమానులు సైతం వాళ్ల బ్రేకప్ వార్తలు విని ఒకింత ఆశ్చర్యానికి లోనవుతుంటారు. అలా బాలీవుడ్ లో కాంట్రవర్సీగా నిలిచిన బ్రేకప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. సల్మాన్ ఖాన్ - ఐశ్వర్యారాయ్
సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ 2002లో విడిపోయారు. ఐశ్వర్యరాయ్ సల్మాన్‌తో బ్రేకప్ పై ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ నాతో శారీరకంగా కలిసిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు.
2.బిపాసా బసు - జాన్ అబ్రహం
జాన్ అబ్రహం, బిపాసా బసు దాదాపు పదేళ్లపాటు డేటింగ్ చేసి ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. తన బ్రేకప్ గురించి బిపాసా ఓ ఇంటర్వ్యూలో చెబుతూ..' బ్రేకప్ అనేది సరైనది కానప్పటికి ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేయడం, మోసం చేయడాన్ని సాధారణంగా క్షమించడం చాలా కష్టం' అంటూ చెప్పింది.
3.రణ్‌బీర్ కపూర్ - దీపికా పదుకునే
'ఏ జవానీ హై దివానీ' సినిమా సమయంలో ప్రేమించుకున్న దీపికా పదుకొనే, రణబీర్ కపూర్ చాలా కాలం పాటు డేటింగ్ చేశారు. కానీ ఆ తర్వాత ఎందుకునో ఈ జంట తమ రిలేషన్‌షిప్‌ని బ్రేకప్‌తో ముంగిచారు. కొన్ని బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం రణబీర్ కపూర్ దీపికను మోసం చేశాడని, అందుకే దీపిక అతనితో బ్రేకప్ చెప్పిందని వార్తలు వినిపించాయి.
4. రణ్‌బీర్ కపూర్ - కత్రినా కైఫ్
రణ్ బీర్, కపూర్ కత్రినా కైఫ్ దాదాపు 6 సంవత్సరాల డేటింగ్ తర్వాత విడిపోయారు. ఇందుకు కారణం రణబీర్ తల్లి నీతూ కపూర్ అని బాలీవుడ్లో ప్రచారం జరిగింది. రణబీర్ కపూర్ తల్లి నీతు కపూర్‌కి కత్రినా కైఫ్ నచ్చలేదని, ఆమెను ఇంటికి కోడలుగా చేసుకోవడానికి రణబీర్ తల్లి ఆసక్తి చూపలేదని, అందుకే రణ్ బీర్ కత్రినాతో విడిపోయినట్లు తెలిసింది.
5. ప్రీతి జింటా - నెస్ వాడియా
2014లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో నెస్ వాడియా తనను వేధించాడని, బెదిరించాడని ప్రీతిజింతా ఆరోపించింది. అంతేకాదు అతనిపై కంప్లైంట్ కూడా చేసింది. నెస్ వాడియా తనపై చేయి చేసుకున్నాడని చేతిపై ఉన్న గాయలను ఫోటోలతో సహా బయట పెట్టింది.
వీళ్లతో పాటు బాలీవుడ్లో మరికొంతమంది సెలబ్రిటీలు కూడా బ్రేకప్ చేసుకున్నారు. కాకపోతే ఆ సెలబ్రిటీల బ్రేకప్ మ్యాటర్ అంతగా కాంట్రవర్షియల్ అవ్వలేదు.పైన పేర్కొన్న జంటల్లో సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోగా, రణబీర్‌తో బ్రేకప్ చెప్పిన దీపిక రణ్వీర్ సింగ్‌ని పెళ్లి చేసుకుంది. అలాగే కత్రినా కైఫ్ రణ్ బీర్‌తో బ్రేకప్ తర్వాత విక్కీ కౌశల్‌ని పెళ్లాడింది.