బాలీవుడ్ నటి సోనమ్, ఆనంద్ దంపతులు పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. సోనమ్ శనివారం(ఆగస్టు 20 ) పండంటి మగబిడ్డకి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని నటి నీతూ కపూర్ సోషల్ మీడియాలో తెలియజేస్తూ సోనమ్, ఆనంద్ కు శుభాకాంక్షలు చెప్పారు. దీనిపై నీతూ సంతోషం వ్యక్తం చేస్తూ తన ఇన్ స్టా స్టోరీలో విషెస్ చెప్తూ నోట్ పెట్టింది. సోనమ్ ప్రసవించడానికి సహకరించిన వైద్యులకు, నర్సులకి, హాస్పిటల్ సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.


‘20.08.2022 రోజున పుట్టిన అందమైన మగబిడ్డకి మేమందరం స్వాగతం పలుకుతున్నాం. ఈ ప్రయాణంలో మాకు మద్దతుగా నిలిచిన వైద్యులు, నర్సులు, స్నేహితులు, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇది ప్రారంభం మాత్రమే ఈ సంతోషం జీవితాంతం ఉంటుంది’ అని ఆమె రాసుకొచ్చారు. సోనమ్ నీతూ షేర్ చేసిన నోట్ నే తన ఇన్ స్టా లో షేర్ చేశారు. ఈ విషయం తెలిసిన పలువు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోనమ్ దంపతులకి శుభాకాంక్షలు  చెప్తున్నారు.


సోనమ్ కపూర్ బాలీవుడ్ అలనాటి హీరో అనిల్ కపూర్ గారాల పట్టి. 1985లో జన్మించింది. బాలీవుడ్లో అధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. తాను ప్రేమించిన  ఆనంద్ ఆహుజాను పెళ్లాడింది. వీరిద్దరి పెళ్లి 2018లో జరిగింది. పెళ్లయ్యాక కూడా సినిమాల్లో నటించింది సోనమ్. గర్భవతి అయిన తర్వాత సోనమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంది.


తన బిడ్డ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు ఆమె పలు సందర్భాలలో చెపుకొచ్చింది. బేబీ బంప్ తో ప్రత్యేకంగా ఫోటో షూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోనమ్ సీమంతం కూడా చాలా ట్రెండీగా జరిగింది. లండన్ లో జరిగిన ఈ వేడుకలో సోనమ్ వెస్ట్రన్ దుస్తులు ధరించారు. అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల మధ్య ఈ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకి పలువురు విదేశీ స్నేహితులని కూడా సోనమ్ ఆహ్వానించింది. ప్రెగ్నెన్సీ సమయంలో తన కాళ్ళు బాగా వాచిపోయాయంటూ ఫోటో కూడా పెట్టింది. దానికి 'ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ ప్రేట్టి' అని క్యాప్షన్ కూడా ఇచ్చింది.  అయితే సోనమ్ ఇండియాలో డెలివరీ చేయించుకుందో లేక విదేశాల్లో చేయించుకుందో తెలియలేదు.


Also Read : తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది, సినిమా ఎలా ఉందంటే?



Also Read : హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?