Netizens Criticized Bollywood Actress Simi Garewal Post On Ravan: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సిమి గరేవాల్... దసరా సందర్భంగా చేసిన ఓ పోస్ట్ విమర్శలకు దారి తీసింది. అసలు దసరా పండుగ రోజు రావణుని దహనం ఎందుకు చేయాలంటూ ఆమె ప్రశ్నించారు. అంతే కాకుండా రావణుడు రాక్షసుడిలా ప్రవర్తించలేదంటూ కామెంట్స్ చేశారు. ఈ పోస్టు వైరల్ కాగా సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆమె ఆ పోస్ట్ తొలగించారు.

Continues below advertisement

అసలు ఆమె ఏం పోస్ట్ చేశారంటే?

ప్రతీ ఏడాది దసరా రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా రావణుని బొమ్మను దహనం చేస్తారు. దీన్ని చెడును పూర్తిగా అంతం చేయడానికి చిహ్నంగా భావిస్తారు. దీన్ని ఉద్దేశించి సిమి అగర్వాల్ పోస్ట్ చేశారు. 'ప్రతీ ఏడాది చెడుపై మంచి సాధించిన విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ రావణా... నువ్వు కాస్త కొంటెగా ప్రవర్తించావు తప్ప రాక్షసుడిలా ప్రవర్తించలేదు. కొంటెతనం మించి ఏ తప్పూ చేయలేదు.

Continues below advertisement

ఓ మహిళను తొందరపడి కిడ్నాప్ చేశావని నేను అంగీకరిస్తున్నా. ఈ కాలంలో ఆడవాళ్లకు ఇస్తున్న గౌరవ మర్యాదలతో పోలిస్తే నువ్వు ఆ స్త్రీ (సీతా దేవి)కి ఎంతో గౌరవం ఇచ్చావు. ఆమెకు మంచి తిండి, ఆశ్రయం కల్పించావు. ఆమె భద్రత కోసం మహిళా సెక్యూరిటీ గార్డులను (వారు అందంగా లేకపోయినప్పటికీ) నియమించావు. నీ పెళ్లి అభ్యర్థన కూడా వినయంతో కూడి ఉంది. ఆమె తిరస్కరించినప్పుడు నువ్వు ఏమీ చేయలేదు. రాముడు నిన్ను చంపినప్పుడు నువ్వు అతనికి క్షమాపణలు చెప్పావు. పార్లమెంటులో ఉన్న సగం మంది కంటే నువ్వే ఎక్కువ చదువుకున్నావు. రావణుడి బొమ్మ కాల్చడానికి నాకెటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆయనేం చేశారన్నదే నా ప్రశ్న. హ్యాపీ దసరా.' అంటూ ట్వీట్ చేశారు.

Also Read: ఓటీటీలోకి పవన్ 'OG' వచ్చేది ఎప్పుడో తెలుసా? - ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్ ఇవ్వనున్న మూవీ టీం

విమర్శలు... వెంటనే డిలీట్

ఈ పోస్టు వైరల్ కాగా నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. సిమి గరేవాల్‌పై విమర్శలు చేశారు. రావణుడు కేవలం అపహణ మాత్రమే కాదని... అధర్మ సామ్రాజ్యం నడిపారని.. ఆ విషయం మీకు తెలియదంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ 'అలాంటి పరిస్థితి మీకు వస్తే తెలుస్తుంది.' అంటూ తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు. 'ఒకరి భార్యను అపహరించి మరో వ్యక్తి పెళ్లి చేసుకోవాలని అడగడం కరెక్టేనా?' అంటూ మరో నెటిజన్ ఆమెను ప్రశ్నించాడు.

తీవ్ర విమర్శలు రావడంతో సిమి గరేవాల్ వెంటనే తన ట్వీట్ డిలీట్ చేశారు. పౌరాణికం, సంస్కృతి, ఆచారాలు వంటి సున్నితమైన అంశాలపై తమ అభిప్రాయాలు చెప్పేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలంటూ కొందరు నెటిజన్లు ఆమెకు సూచనలిస్తున్నారు. సిమి గరేవాల్ పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించడమే కాకుండా పలు సినిమాలకు డైరెక్టర్, నిర్మాతగానూ చేశారు. దో బదన్, సాథీ, మేరా నామ్ జోకర్, సిద్దార్థ్, కర్జ్ & ఉదీకాన్ వంటి హిట్ మూవీస్‌లో నటించారు.