Bollywood Actress Karishma Sharma Gets Injury In Train Accident: 'రాగిణి ఎంఎంఎస్: రిటర్న్స్' మూవీతో అలరించిన బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా శర్మ గురువారం ఊహించని ప్రమాదానికి గురయ్యారు. ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణించిన ఆమె కంగారులో వేగంగా వెళ్తున్న రైలు నుంచి దూకేశారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్ స్టా స్టోరీలో చెప్పడంతో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే?
అసలు తనకు ప్రమాదం ఎలా జరిగిందో వివరిస్తూ కరిష్మా తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ పెట్టారు. 'ఓ సినిమా షూటింగ్ కోసం స్పాట్‌కు వెళ్లేందుకు గురువారం చీర ధరించి బయల్దేరాను. నేను ముంబై లోకల్ ట్రైన్‌లో ఎక్కగానే అది వేగంగా కదిలింది. దీంతో నా స్నేహితులు దాన్ని అందుకోలేకపోయారు. వాళ్లు రైలు ఎక్కలేదే అనే టెన్షన్ భయం కంగారులో నేను కదులుతున్న రైలు నుంచి ఒక్కసారిగా బయటకు దూకేశాను. దురదృష్టవశాత్తూ వెనక్కి తిరిగి పడడంతో వీపు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెన్నెముకకు కూడా గాయమైంది.
శరీరమంతా చిన్న చిన్న గాయాలయ్యాయి. తలకు దెబ్బ తగలడంతో డాక్టర్లు MRI స్కాన్ తీశారు. ఒక రోజు అబ్జర్వేషన్‌లో ఉండాలని సూచించారు. నేను ధైర్యంగా ఉన్నా. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నా. ప్రమాదం జరిగినప్పటి నుంచి నొప్పితో బాధ పడుతున్నా. మీ ప్రేమాభిమానాలే నన్ను కోలుకునేలా చేస్తాయి. దయచేసి నా కోసం ప్రార్థించండి.' అంటూ రాసుకొచ్చారు. దీన్ని చూసిన నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Also Read: వాట్ ఏ మూమెంట్ - తమన్ స్టూడియోలో బాలయ్య బోయపాటి... 'అఖండ 2' ఇంటర్వెల్ వైబ్
సినిమాల విషయానికొస్తే... కరిష్మా శర్మ 'ప్యార్ కా పంచనామా 2', హోటల్ మిలన్, ఏక్ విలన్ రిటర్న్స్, ఉజ్దా చమాన్ మూవీస్‌లో నటించి మెప్పించారు. దీంతో పాటే 'రాగిణి ఎంఎంఎస్: రిటర్న్స్' వెబ్ సిరీస్‌లోనూ కీలక పాత్ర పోషించారు. మూవీస్‌లోనే కాకుండా పలు సీరియళ్లలోనూ నటించారు. పవిత్ర రిస్తా, కామెడీ సర్కస్, సిల్ సిలా ప్యార్ కా వంటి సీరియల్స్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు.