Balakrishna Photo Moment With Boyapati Srinu Thaman: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో లేటెస్ట్ పాన్ ఇండియా రేంజ్ హై యాక్షన్ థ్రిల్లర్ 'అఖండ 2'. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన 'అఖండ'కు సీక్వెల్‌గా మూవీ తెరకెక్కుతుండగా ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, టీజర్ గూస్ బంప్స్ తెప్పించాయి. మ్యూజిక్ లెజెండ్ తమన్ బీజీఎం వేరే లెవల్. తాజాగా తమన్ స్టూడియోను బాలయ్య సందర్శించారు.
బాలయ్యతో కలిసి
డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి తమన్ స్టూడియోను సందర్శించిన బాలయ్య సందడి చేశారు. 'అఖండ 2' ఇంటర్వెల్ సీక్వెన్స్ రికార్డింగ్‌ను పరిశీలించారు. తమన్, బోయపాటి, బాలయ్య కలిసి ఫోటోలు దిగారు. 'నందమూరి బాలకృష్ణ మా స్టూడియోకు వచ్చారు. ఆయన ఆశీస్సులు నాకు అవసరం. బాలయ్యతో చాలా ఎక్కువ టైం గడిపాను. అఖండ ఇంటర్వెల్ సీక్వెన్స్, ఇప్పటివరకూ రికార్డ్ చేసిన అద్భుతమైన సంగీతం ఎపిసోడ్ చూడడం చాలా ఆనందం కలిగించింది.' అంటూ బాలయ్యతో దిగిన ఫోటోను షేర్ చేశారు తమన్.
ఈ ఫోటో వైరల్ అవుతుండగా... 'అఖండ 2'కు థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌లో బీజీఎం వేరే లెవల్‌లో ఉందని... బాలయ్య మాస్ యాక్షన్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌కు తగ్గట్లుగా తమన్ మోత మోగిస్తారని అంటున్నారు.
Also Read: 'మిరాయ్' రివ్యూ: క్లైమాక్స్‌లో శ్రీరాముడు వచ్చాడు... తేజా సజ్జా - మంచు మనోజ్ మూవీ హిట్టేనా?
రిలీజ్ ఎప్పుడు?
'అఖండ 2' ఈ నెల 25నే రిలీజ్ అవుతుందని అంతా భావించినా వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన బాలయ్య డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు. దీంతో డిసెంబర్ 5న శుక్రవారం కావడంతో ఆ రోజున రిలీజ్ అవుతందని అంతా భావిస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌ను సెకండ్ పార్టులో యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని... బాలయ్య ఫ్యాన్స్‌కు పవర్ ఫుల్ మాస్ ట్రీట్ ఖాయమంటూ టీం చెబుతోంది.
ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేస్తుండగా... ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్నారు. టీజర్‌లోనే ఆది లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. గంజాయి, డ్రగ్స్ వంటి అక్రమాలపై ఉక్కుపాదం మోపడం సహా, సనాతన ధర్మం, ఆధ్యాత్మికం, మెసేజ్ ఓరియెంటెడ్ ఇలా అన్నీ అంశాలు కలగలిపేలా మూవీ ఉండనుందనే టాక్ వినిపిస్తోంది. '14 రీల్స్ ప్లస్' బ్యానర్‌పై ఎం.తేజస్విని సమర్పణలో రామ్ అచంట, గోపి అచంట మూవీని నిర్మిస్తున్నారు. సూపర్ హిట్ కాంబో మరో హిట్ కొట్టడం ఖాయమంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.