Deepika Padukone Reaction On Controversial Issues: బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఇటీవల పలు అంశాల్లో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రభాస్ 'కల్కి 2' నుంచి దీపికాను తప్పించడం సహా వర్కింగ్ అవర్స్, కండీషన్స్ విషయంలో ఆమె తీరు వివాదాస్పదమైంది. తాజాగా ఫరాఖాన్ అంశం, ఐఎండీబీ లిస్ట్‌పై ఆమె రియాక్ట్ అయ్యారు.
ఫరాఖాన్ అంశంపై...
ఫేమస్ కొరియోగ్రాఫర్, బాలీవుడ్ డైరెక్టర్ ఫరాఖాన్‌ను దీపికా అన్ ఫాలో చేశారన్న వార్తలు రీసెంట్‌గా హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై ఘాటుగా స్పందించిన ఫరాఖాన్... సదరు మీడియా కథనాలకు రిప్లై ఇచ్చారు. దీపికా, నేను సోషల్ మీడియాలో కాకుండా డైరెక్ట్‌గా మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. 'మేమిద్దరం బర్త్ డే విషెష్ కూడా పంచుకోం. అలాంటివి దీపికకు నచ్చవు. చిన్న చిన్న విషయాలు కూడా కాంట్రవర్శీ చెయ్యొద్దు.' అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఈ కామెంట్స్‌పై స్పందించిన దీపికా పదుకోన్... ఫరాఖాన్ చెప్పిన విషయాలే తాను కూడా చెప్పాలనుకుంటున్నట్లు తెలిపారు. తథాస్తూ... అంటూ చేతులు జోడించిన ఎమోజీలను పోస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే?
రీసెంట్‌గా ఓ టీవీ షోలో పాల్గొన్న ఫరాఖాన్... 'ఆమె ఇప్పుడు పని చేసేది 8 గంటలే. ఈ షోకు వచ్చేంత టైం ఎక్కడిది?.' అంటూ కామెంట్ చేయగా వైరల్ అయ్యాయి. దీంతో ఆమెను దీపికా అన్ ఫాలో చేశారనే వార్తలు వచ్చాయి. మరోవైపు ఫరాఖాన్ సైతం దీపికా, రణ్‌వీర్ ఇద్దరినీ అన్ ఫాలో చేసినట్లు తెలుస్తోంది. ఇది ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన వేళ అటు ఫరాఖాన్ ఇటు దీపికా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇక వీరిద్దరి కాంబోలో 'ఓం శాంతి ఓం', 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి.
సవాళ్లకు సిద్ధంగా ఉంటా
సవాళ్లకు తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానంటూ దీపికా తాజాగా ఇంటర్వ్యూలో చెప్పారు. 'నా కెరీర్‌లో నేను ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. సవాళ్లను స్వీకరించడంలో భయపడలేదు. వాటికీ ఎప్పుడూ రెడీగానే ఉన్నాను. క్వశ్చన్ చేసేందుకు వెనుకాడను. నా ఫ్యామిలీ, ఫ్యాన్స్ సపోర్ట్, ప్రేమాభిమానాలే నాకు విమర్శలను ఎదుర్కొనే శక్తి ఇచ్చాయి.' అంటూ చెప్పారు.
ఇక ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ తాజాగా 26 ఏళ్ల సినిమాలకు సంబంధించి లిస్ట్ రిలీజ్ చేయగా ఇందులో దీపికా నటించిన చిత్రాలే 10 ఉన్నాయి. దీనిపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ నివేదిక తనలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని చెప్పారు.
Also Read: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ప్రభాస్ 'కల్కి 2' మూవీ నుంచి దీపికా పదుకోన్‌ను చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తప్పించింది. అంతకు ముందు సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' మూవీ నుంచి కూడా ఆమెను తప్పించడంతో హాట్ టాపిక్‌గా మారింది. వర్క్ అవర్స్, కండీషిన్స్ విషయంలో దీపికా పట్టుబట్టడంతోనే ఆమెను తప్పించారనే వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె ప్రత్యక్షంగా స్పందించకపోయినా ఇటీవల ఇన్ స్టాలో చేసిన పోస్టులు వైరల్‌గా మారాయి.