Dhanush's Idli Kottu Movie OTT Partner Locked: కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'ఇడ్లీ కడై'. తెలుగులో ఈ మూవీ 'ఇడ్లీ కొట్టు'గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రీసెంట్‌గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'కుబేర'తో హిట్ కొట్టిన ధనుష్‌కు డైరెక్టర్‌గా ఇది నాలుగో సినిమా. దీంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఆ ఓటీటీలోకి స్ట్రీమింగ్
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. తెలుగు, తమిళం భాషల్లో మూవీ రిలీజ్ కాగా... థియేట్రికల్ రన్ తర్వాత ఈ రెండు భాషల్లోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా థియేటర్లలోకి వచ్చిన 6 నుంచి 8 వారాల తర్వాత ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం.
ధనుష్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటు అరుణ్ విజయ్, సత్య రాజ్, రాజ్ కిరణ్, షాలిని పాండే కీలక పాత్రలు పోషించారు. డాన్ పిక్చర్స్, వండర్ బార్ ఫిల్మ్స్ సంస్థలపై ఆకాష్ భాస్కరన్ నిర్మించగా... తెలుగులో వేదాక్షర మూవీస్ బ్యానర్‌పై రామారావు చింతపల్లి రిలీజ్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. తన తండ్రి ఆశయం కోసం బిజినెస్ మ్యాన్ అయిన ఓ కొడుకు ఏం చేశాడు? అనేదే ప్రధానాంశంగా మూవీ తెరకెక్కింది.