Rishab Shetty's Telugu Specch In Kantara Chapter 1 Event In Vijayawada: రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగిన 'కాంతార చాప్టర్ 1' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కన్నడ స్టార్ రిషబ్ కన్నడ స్పీచ్‌పై వివాదం రేగిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రంలో తెలుగులో మాట్లాడకుండా కన్నడలో మాట్లాడడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. ఏకంగా 'బాయ్ కాట్ కాంతార' అంటూ హ్యాష్ ట్యాగ్‌నే ట్రెండ్ చేశారు. తాజాగా దీనిపై రిషబ్ రియాక్ట్ అయ్యారు. 

Continues below advertisement

తెలుగు స్పీచ్

విజయవాడలో తాజాగా జరిగిన 'కాంతార చాప్టర్ 1' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలుగులో మాట్లాడిన రిషబ్ శెట్టి... తనకు తెలుగు అంతగా రాదని అందుకే ఆ ఈవెంట్‌లో కన్నడలో మాట్లాడానని చెప్పారు. 'నాకు తెలుగు అంత బాగా రాదు. కానీ మాట్లాడేందుకు ట్రై చేస్తున్నా. నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థాంక్స్. ట్రైలర్ రిలీజ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్, డార్లింగ్ ప్రభాస్‌కు కృతజ్ఞతలు. ఏపీలో టికెట్ రేట్స్ పెంచిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి థాంక్స్.

Continues below advertisement

కన్నడ, తెలుగు అందరం సోదరులం. నెక్స్ట్ మూవీ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్‌లో వర్క్ చేస్తున్నా. నెక్స్ట్ 'జై హనుమాన్' మూవీ టైంకు పూర్తిగా తెలుగు నేర్చుకుని వస్తాను. అప్పుడు కచ్చితంగా తెలుగులోనే మాట్లాడతాను. అక్టోబర్ 2న కాంతార 1 మూవీని అందరూ చూడాలి.' అని తెలిపారు.

Also Read: 'కాంతార' vs 'ఇడ్లీ కొట్టు'... తెలుగులో ఎవరికి క్రేజ్ ఎక్కువ? ఎవరిది అప్పర్ హ్యాండ్??

ఆ స్పీచ్‌తోనే...

హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో రిషబ్ శెట్టి కన్నడలో మాట్లాడడంపై వివాదం రేగింది. కన్నడలో తెలుగు సినిమాలను ఆదరించడం లేదని... ఇక్కడ ఎందుకు ఆదరించాలంటూ కొందరు సోషల్ మీడియాలో క్వశ్చన్ చేశారు. ఇదే టైంలో తెలుగు రాష్ట్రంలో తెలుగులో స్పీచ్ ఇవ్వకుండా కన్నడలో మాట్లాడడం ఏంటి అంటూ మరికొందరు విమర్శలు చేశారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన పవన్ కల్యాణ్ 'OG' మూవీని కర్ణాటకలోని కొన్ని థియేటర్లలో పోస్టర్స్ సైతం కట్టనివ్వలేదని... గతంలోనూ తెలుగు సినిమాల విషయంలో వివాదం చేశారని వీడియోలు పోస్ట్ చేశారు.

ఇప్పుడు మన టైం వచ్చిందని తెలుగు రాష్ట్రాల్లో 'కాంతార చాప్టర్ 1' మూవీని బాయ్ కాట్ చేయాలంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఇక ఏపీలో టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపైనా విమర్శలు వచ్చాయి. దీనిపై రియాక్ట్ అయిన పవన్... కళ మనసుల్ని హత్తుకుని మనుషుల్ని కలిపేదిగా ఉండాలని... ప్రాంతాల పేరుతో మనుషుల్ని విడదీసేదిగా ఉండకూడదని చెప్పారు. 

టికెట్ రేట్స్ పెంపు

ఏపీలో 'కాంతార 1' టికెట్ రేట్స్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీమియర్ షోలకు సైతం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షోలతో పాటు అక్టోబర్ 2 నుంచి 11 వరకూ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75లతో పాటు జీఎస్టీ, మల్టీ ఫ్లెక్స్ థియేటర్లలో 100 రూపాయలతో పాటు జీఎస్టీ పెంచుకునేందుకు అనుమతిచ్చింది. దీనిపై మూవీ టీం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.