Actor Emraan Hashmi Reaction On Some Actors Not Come To Movie Sets : ప్రస్తుతం ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్, డెడికేషన్, టైంకు రాకపోవడం వంటి టాపిక్స్ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ వర్కింగ్ అవర్స్ అంశం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా... బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ వీటిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇవి ఎవరిని ఉద్దేశించి అన్నారో అనే చర్చ మొదలైంది.
రీసెంట్‌గానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'OG' మూవీలో విలన్ రోల్‌లో అదరగొట్టారు ఇమ్రాన్ హష్మీ. ఆయనకు తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'Haq'. ఉమెన్ రైట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సుపర్ణ ఎస్ వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో యూమీ గౌతమ్ హీరోయిన్‌గా నటించారు. నవంబర్ 7న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్లలో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పని వేళలు, నటులు సెట్స్‌కు టైంకు రాకపోవడం గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
'కొందరు యాక్టర్స్ సెట్స్‌కే రారు'
ఇంటర్వ్యూలో హీరోయిన్ యామీ గౌతమ్‌పై ఇమ్రాన్ ప్రశంసలు కురిపించారు. ఆమె సెట్స్‌కు టైమ్‌కు వచ్చేస్తారని... డెడికేషన్‌తో వర్క్ చేస్తారని చెప్పారు. 'టైంకు రాని యాక్టర్స్ ఉంటారా?' అని యాంకర్ అడగ్గా... 'టైంకు రావడం కాదు. కొందరు అసలు షూటింగ్ సెట్స్‌కే రారు.' అంటూ కామెంట్స్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా... ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్‌గా మారింది.
ఎవరిని ఉద్దేశించి అన్నారో?
ఈ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి అన్నారో అనేది ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. కొందరు నెటిజన్లు సల్మాన్ ఖాన్‌ను ఉద్దేశించి అన్నారని అంటుండగా... మరికొందరు మాత్రం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించే అన్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇమ్రాన్ రీసెంట్‌గా 'OG'లో విలన్ రోల్ చేయగా... అందులో షూటింగ్ షెడ్యూల్, యాక్టర్స్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ 3 సినిమాలు చేస్తున్నారు. తెలుగులో అడివి శేష్ హీరోగా చేస్తోన్న 'గూఢచారి 2'లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
Also Read : అవెయిటెడ్ స్పై థ్రిల్లర్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 3' - ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది