Adivi Sesh's Dacoit Movie Release Date : టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన అవెయిటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్'. ఇప్పటికే రిలీజ్ అయిన ఫైర్ గ్లింప్స్, లుక్స్ వేరే లెవల్‌లో ఉండగా... మూవీ రిలీజ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ రిలీజ్ డేట్‌ను తాజాగా అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు.
రిలీజ్ ఎప్పుడంటే?
వచ్చే ఏడాది మార్చి 19న 'డెకాయిట్' మూవీ రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'ఈసారి మామూలుగా ఉండదు. ఇక వెనక్కి తిరిగి చూడం. ఈ ఉగాది డెకాయిట్ వచ్చేస్తోంది.' అంటూ హీరో అడివి శేష్ రాసుకొచ్చారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అడివి శేష్ ఖైదీ రోల్‌లో కనిపించనుండగా.... మృణాల్ జూలియట్ రోల్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే షూటింగ్ చాలా వరకూ పూర్తైనట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో హీరో హీరోయిన్లకు గాయాలు కాగా షెడ్యూల్‌కు కాస్త బ్రేక్ పడినట్లు టాక్ వినిపిస్తోంది. మళ్లీ తిరిగి షూటింగ్ ప్రారంభం కాగా రాబోయే ఉగాదికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: అవెయిటెడ్ స్పై థ్రిల్లర్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 3' - ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
మూవీలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్‌తో పాటు ప్రకాష్ రాజ్, జైన్ మేరీ ఖాన్, అతుల్ కులకర్ణి, సునీల్, అనురాగ్ కశ్యప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'క్షణం', 'గూఢచారి' వంటి సినిమాలకు కెమెరామెన్‌గా వ్యవహరించిన షానీల్ డియో దర్శకత్వం వహిస్తుండగా... అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ సంస్థలపై కింగ్ నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇద్దరు మాజీ లవర్స్ మధ్య జరిగిన కథ, తమ జీవితాలను మార్చుకునేందుకు వరుస చోరీలకు ప్లాన్ చేయగా... ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే స్టోరీ అని తెలుస్తోంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న ఇద్దరు లవర్స్ బద్ద శత్రువులుగా ఎలా, ఎందుకు మారారు? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.