Bobby Deol Interesting Role In War 2 Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ రిలీజ్‌కు ముందే అటు సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది. తాజాగా ఓ లేటెస్ట్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

క్లైమాక్స్ సీన్‌లో...

ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ గెస్ట్ రోల్‌లో మెరుస్తున్నట్లు తెలుస్తోంది. క్లైమాక్స్ సీన్‌లో ఆయన కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మూవీలో చాలా సర్‌ప్రైజ్‌లు ట్విస్టులు ఉంటాయని వాటిని రివీల్ చెయ్యొద్దంటూ రిక్వెస్ట్ చేశారు. అయితే, ఆ సర్ ప్రైజ్ ఈ రోల్ అయ్యుంటుంది అనే ప్రచారం సాగుతోంది. మరి దీనిలో నిజానిజాలు తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

Also Read: మహేష్ బాబు నిర్మాతగా కొత్త మూవీ - ఫస్ట్ లుక్‌తోనే అదరగొట్టేశాడుగా... టీజర్ లోడింగ్

ప్రతిదీ ట్రెండింగ్

ఎన్టీఆర్‌కు ఇది ఫస్ట్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ కాగా... బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తుండడంతో ప్రతిదీ ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, హృతిక్ మధ్య వార్ సీక్వెన్స్ వేరే లెవల్‌లో ఉండగా... దేశాన్ని కాపాడేందుకు ఇద్దరు సోల్జర్స్ మధ్య వార్ ఎందుకు వచ్చింది అనేది హైప్ క్రియేట్ చేస్తోంది. 

ఆ సీన్స్ కట్

ఈ మూవీ సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ ఇవ్వగా... తెలుగు, తమిళ భాషల్లో రన్ టైం 2 గంటల 51 నిమిషాల 44 సెకన్స్‌గా ఉంది. ఇక హిందీ వెర్షన్‌లో 2 గంటల 53 నిమిషాల 24 సెకన్లుగా ఉండడంతో అసలు బాలీవుడ్‌లో ఆ 2 నిమిషాల సీన్స్ ఏం యాడ్ చేసుంటారో అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సెన్సార్ బోర్డ్ మూవీ టీంకు కొన్ని కట్స్ సూచించినట్లు తెలుస్తోంది. కియారా అద్వానీ బికినీ సీన్స్ కొన్నింటిని 9 సెకన్స్ ట్రిమ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

అలాగే, ఎన్టీఆర్ (విక్రమ్), హృతిక్ (కబీర్) మధ్య వార్ సీక్వెన్స్‌లో 11 కట్స్ సూచించినట్లు సమాచారం. ఇరువురి మధ్య బోట్ ఛేజింగ్ సీన్ 29 సెకన్స్, రేసింగ్ ట్రాక్‌పై యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ముగ్గురి మధ్య కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కట్ చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఎండ్ క్రెడిట్స్ నిడివి సహా మొత్తంగా 6 నిమిషాల 25 సెకన్ల పాటు సీన్స్ కట్ చేయాలని సూచించినట్లు సమాచారం.

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా ఆరో మూవీగా 'వార్ 2' రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ మూవీని రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కానుండగా... ఏపీ, తెలంగాణలో హిందీ వెర్షన్ కొన్ని థియేటర్స్‌లోనే రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ మూవీ లవర్స్ 'వార్ 2' కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.