Anil Kapoor Telugu Speech: రణ్‌బీర్ కపూర్, ర‌ష్మిక మంద‌న్న హీరో హీరోయిన్లుగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'యానిమల్'. ప్రమోషనల్ కంటెంట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ వైల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం సినీ అభిమానులు ఆతృతగా వేచి చూస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. దీనికి సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. ఈవెంట్ కు వచ్చిన జనాన్ని చూసి బాలీవుడ్ యాక్టర్స్ బాబీ డియోల్, అనిల్ కపూర్ ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా అనిల్ తన స్పీచ్ ను తెలుగులోకి ట్రాన్స్ లేట్ చేసుకొని మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది.


''అందరూ బాగున్నారా? ట్రైలర్ చూశారా? నచ్చిందా? మీకో విషయం చెప్పాలి. ఒక యాక్టర్‌గా నాకు జన్మనిచ్చింది తెలుగు సినీ ఇండస్ట్రీ. 1980లో తెలుగులో నా డెబ్యూ మూవీ వచ్చింది. ది గ్రేట్ బాపూ సార్ దర్శకత్వంలో 'వంశవృక్షం' సినిమా చేశాను. ఇన్నాళ్లకు మళ్ళీ ఇప్పుడు మీ ముందుకు వచ్చా. లేట్ గా వచ్చినా లేటెస్టుగా వచ్చా. ఇది నాకు చాలా స్పెషల్ ఫీలింగ్'' అంటూ అనిల్ కపూర్ తెలుగులో మాట్లాడారు. సందీప్ వంగా క్రేజీ అని, ఒక బ్రిలియంట్ డైరెక్టర్ అని ఆయన అన్నారు. 'యానిమల్' సినిమాలో రణబీర్ కపూర్ అద్భుతంగా నటించారని, ఈ సినిమా బాబీ డియోల్ లైఫ్ ని చేంజ్ చేస్తుందని చెప్పారు. 


43 ఏళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్ లో లీడ్ యాక్టర్ గా తెలుగు మూవీ చేశాను. ఇన్నేళ్ల తర్వాత నా సెకండ్ తెలుగు ఫిలిం రిలీజ్ అవుతోంది. దీనికి రష్మిక మందన్న లక్ కలిసి రావాలని కోరుకుంటున్నాను అని అనిల్ కపూర్ అన్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. తమ మధ్య చాలా లాంగ్ ఫ్యామిలీ రిలేషన్ ఉందని, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ చాలా ఏళ్లుగా తనకు తెలుసని చెప్పారు. నమ్రతాను భార్యగా పొందడం మహేష్ అదృష్టమని, బ్యూటిఫుల్ చిల్డ్రన్స్, గ్రేట్ కెరీర్ తో ముందుకు సాగుతున్నారన్నారు. మహేష్ ఒక ఫ్యామిలీ మ్యాన్ అని, అందుకే అందరూ ఆయన్ని అంతగా ఇష్టపడతారని పేర్కొన్నారు అనిల్. రాజమౌళి మనందరినీ గర్వపడేలా చేశారని, యావత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని మోటివేట్ చేశారని కొనియాడారు. 


Also Read: 'యానిమల్‌' ఈవెంట్ లో 'పోకిరి' సాంగ్ కు స్టెప్పులేసిన మహేష్!






అంతకముందు ప్రెస్ మీట్ లోనూ అనిల్ కపూర్ టాలీవుడ్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 'వంశవృక్షం' సినిమాతో సౌత్ లో ఫౌండేషన్ పడిందని, ఇక్కడే అన్నీ నేర్చుకున్నానని తెలిపారు. తన రెండో తెలుగు సినిమాగా 'యానిమల్' విడుదల కావడం ఆనందంగా ఉందన్నారు. సందీప్ వంగా ఈ కథ చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నానని, సందీప్ అంత అద్భుతంగా రాసుకున్నాడని చెప్పారు. ఇందులో తండ్రీకొడుకుల బంధం చాలా విలక్షణంగా వుంటుందని, అందరూ ఎమోషన్స్ కు బాగా కనెక్ట్ అవుతారని తెలిపారు. సాధారణంగా తండ్రి ఒక స్థాయికి వచ్చిన తర్వాత కొడుకు తన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటారని, కానీ ఈ సినిమాలో తండ్రి పట్ల కొడుకుకి అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ తన సొంత మార్గంలో నడవాలని అనుకుంటాడని, ఆ సంఘర్షణను చాలా అద్భుతంగా చూపించడం జరిగిందని చెప్పారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, ఖచ్చితంగా ఆడియన్స్ ను అలరిస్తుందని అనిల్ కపూర్ ధీమా వ్యక్తం చేశారు.


కాగా, 'యానిమల్' చిత్రాన్ని టి-సిరీస్ & భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.


Also Read: ‘యానిమల్‌’ ట్రైలర్ చూసి మెంటల్ వచ్చేసింది - మహేశ్ బాబు


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply