Mahesh Babu at Animal Pre Release Event: బాలీవుడ్‌ స్టార్ రణబీర్‌ కపూర్‌ హీరోగా టాలీవుడ్‌ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన తాజా చిత్రం ‘యానిమల్‌’. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. బాబీ డియోల్, అనిల్‌ కపూర్‌ కీలక పాత్రలు పోషించారు. సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వైల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబరు 1న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 


ఈ సందర్భంగా మహేశ్‌ బాబు మాట్లాడుతూ.. సందీప్ రెడ్డి 'యానిమల్' మూవీలో చూపించిన తండ్రీ కొడుకుల బాండింగ్ ని, తాను రియల్ లైఫ్ లో ఎప్పుడూ చూడలేదని నవ్వుతూ అన్నారు. అలాంటి బాండింగ్ కేవలం సందీప్ సినిమాల్లోనే ఉంటుందని.. ఇది చాలా యునిక్ గా, కొత్తగా, ఒరిజినల్ గా ఉందని పేర్కొన్నారు. ట్రైలర్ చూసి తనకి మెంటల్ ఎక్కిపోయిందని, ఇలాంటి ఒరిజినల్ ట్రెయిలర్ ను తాను ఇంత వరకూ చూడలేదని అన్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ కు తాను పెద్ద అభిమానినని మహేశ్ తెలిపారు. వైఫ్ ని మ్యానేజ్ చెయ్యడానికి ఎల్లప్పుడూ ఆమె దగ్గర నవ్వుతూ ఉంటే సరిపోతుందని నవ్వుతూ చెప్పారు. 


‘‘మీరందరూ ఇలా వచ్చి 'యానిమల్‌’ సినిమాని సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మొన్న ఈ మూవీ ట్రైలర్‌ చూసి మెంటల్ వచ్చేసింది అంతే.. ఇంతటి ఒరిజినల్‌ ట్రైలర్‌ నేనైతే ఇప్పటివరకు చూడలేదు. నేను మామూలుగా ఇలా చెప్పను.. ఏదైనా ఫీల్ అయితేనే ఇలా చెప్తుంటాను. నిన్న నైట్ సందీప్‌ ఫోన్‌ చేసి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు వస్తారా? అని అడిగారు. నేను నా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్ళడమే ఇబ్బంది.. కానీ సందీప్ అడిగిన వెంటనే రావాలనిపించింది. ఎందుకంటే నిజంగా నాకు ఈ సినిమాని సపోర్ట్ చెయ్యాలనిపించింది'' అని మహేష్ బాబు అన్నారు.


"సందీప్ అంటే నాకు చాలా ఇష్టం. అతను ఎంతో స్పెషల్.. యునిక్. సందీప్.. నువ్వు దేశంలోనే ఒరిజినల్ ఫిల్మ్ మేకర్ వి. మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నందుకు థాంక్యూ. నువ్వు ఎప్పుడూ ఇలానే మనసుకు నచ్చిన సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. 'యానిమల్' అడ్వాన్స్‌ బుకింగ్స్‌ లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోందని ఇవాళే ఎవరో చెప్పారు. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లా లేదు.. సినిమా 100 డేస్ ఫంక్షన్ లా ఉంది. సందీప్ కి బ్లాక్ బస్టర్ సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను"


"అనిల్ కపూర్ సర్.. మీ బాడీ వర్క్ ని, మీ స్క్రీన్ ప్రజెన్స్ ని అస్సలు ఎవరూ మ్యాచ్ చెయ్యలేరు. ట్రైలర్ లో కొన్ని సీన్స్ లో నాకు గూస్ బంప్స్ వచ్చాయి. మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నందుకు థాంక్స్ సార్. టీజర్ చివర్లో బాబీ డియోల్ ట్రాన్స్ఫర్మేషన్ చూసినప్పుడే స్టన్ అయిపోయాను. బిగ్ స్క్రీన్ మీద చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నేను రణ్‌ బీర్‌ కు పెద్ద అభిమానిని. ఆయనతో ఈ విషయం ఎప్పుడో చెప్పాను. కానీ దాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నాడని నేను అనుకోవడం లేదు. అందుకే ఈ స్టేజ్ మీద మరోసారి చెప్తున్నా. నేను ఆయనకు చాలా పెద్ద ఫ్యాన్ ని. రణ్‌బీర్‌ ఇండియాలోనే బెస్ట్‌ యాక్టర్‌ అని నా అభిప్రాయం. యానిమల్ అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది. రష్మికని చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోనూ నటిస్తోంది. నటిగా ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని మహేశ్ అన్నారు.






Also Read: డీప్ ఫేక్ వీడియోపై స్పందించిన రష్మిక - అలా అనేసింది ఏమిటీ?


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply