బాబీ డియోల్ (Bobby Deol) కెరీర్ ఎండ్ అయిపోయింది అనుకున్న సమయంలో తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అతని జీవితాన్నే మార్చేశాడు. 'యానిమల్' సినిమాతో బాబీ డియోల్ ఇమేజ్‌ను 'లార్డ్' బాబీ డియోల్‌గా ఫ్యాన్స్ గుండెల్లో సెటిల్ చేసేశాడు. ఎన్నో సార్లు ఈ విషయం చెబుతూ 'బాబీ' ఎమోషనల్ అయిపోతుంటాడు కూడా. ప్రస్తుతం బాబీ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆయనకంటూ ప్రత్యేకంగా పాత్రలు రెడీ అవుతున్నాయి. ఆ కోవలో తెలుగులో విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన బాబీ డియోల్ తొలి సినిమా 'డాకు మహారాజ్'తోనే హిట్టు కొట్టేసారు.
పవన్ కళ్యాణ్‌తో ఎంట్రీ... బాలయ్య బాబుతో రిలీజ్
నిజానికి బాబీ డియోల్ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు'తో. కానీ, ఆ సినిమా షూటింగ్ డిలే కావడంతో 'డాకు మహారాజ్' ఫస్ట్ రిలీజ్ అయింది. ఈ మూవీలో 'బలవంత్ సింగ్ ఠాకూర్' పాత్రలో విలనీ పండించారు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో బాబీ నెక్స్ట్ సినిమాలపై ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ పెరిగింది.
బాబీ నెక్స్ట్ లైనప్ మామూలుగా లేదు... 2025లో వచ్చేవి ఇవే
నిజానికి బాబి డియోల్ తెలుగు కంటే ముందు 'కంగువ'తో సౌత్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో కాస్త నిరాశకు లోనైనా 'డాకు మహారాజ్' హిట్‌తో ఆయన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు'లో మొగల్ చక్రవర్తి 'ఔరంగ్ జేబు' పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక దళపతి
విజయ్ 69 సినిమాలోనూ బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ నటిస్తున్న చివరి సినిమాగా ఈ మూవీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అలాగే బాలకృష్ణ సూపర్ హిట్ 'భగవంత్ కేసరి' స్ఫూర్తితో వస్తున్న సినిమాగానూ ప్రచారం సాగుతోంది.
బాలీవుడ్‌లో సూపర్ హిట్ సిరీస్‌లో వస్తున్న 'హౌస్ ఫుల్ 5'లోనూ, యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఫిల్మ్ 'వార్ 2' తర్వాత వస్తున్న 'ఆల్ఫా'లోనూ బాబీ డియోల్ నటిస్తున్నారు. 'ఆల్ఫా'లో అలియా భట్, త్రిష, ప్రియమణి, శార్వరి లాంటి హీరోయిన్లు ఫీమేల్ లీడ్స్ గా నటిస్తుండగా బాబీ విలన్‌గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో అనిల్ కపూర్ తెలుగు పాత్రలో కనిపించనున్నారు. హృతిక్ రోషన్ స్పెషల్ కామియో ఇవ్వనున్నారు. ఈ సినిమాలన్నీ 2025 లోనే రిలీజ్ కానుండడం విశేషం.
Also Read: సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
వచ్చే ఏడాది కమల్, ఎన్టీఆర్‌లకు విలన్‌గా బాబీ డియోల్
వచ్చే ఏడాది బాబీ డియోల్ రెండు క్రేజీ ప్రాజెక్టులతో రెడీ అవుతున్నారు. కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ తీసిన సూపర్ హిట్ 'విక్రమ్' సీక్వెల్‌తో పాటు టాలీవుడ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న 'డ్రాగన్'లోనూ బాబీ డియోల్ కనపడనున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో తిరుగులేని ప్రాజెక్టులలో బాబీ డియోల్ దూసుకుపోతున్నారు. అయితే ఆ కెరీర్ ని బాలీవుడ్ లో మలుపు తిప్పింది తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అయితే సౌత్ లో ఫస్ట్ హిట్ ఇచ్చింది కూడా మరో తెలుగు డైరెక్టర్ బాబీ కావడం విశేషం.