టాలీవుడ్ లో రీసెంట్ టైమ్స్ లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీస్ లో 'బేబీ'(Baby) ముందు వరుసలో ఉంటుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో తెలిసిందే. జూలై 14న థియేటర్స్ లో ఓ చిన్న సినిమాగా విడుదలై భారీ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై యువ నిర్మాత ఎస్ కే ఎన్  ఈ సినిమాని నిర్మించారు. సుమారు రూ.10 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్ లో దాదాపు రూ.90 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టి, ఈ ఏడాది అత్యధిక కలెక్షన్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా రూపొందిన ఈ మూవీలో ఆనంద్ వైష్ణవి, చైతన్య యాక్టింగ్ తో పాటు సాంగ్స్, డైరెక్టర్ సాయి రాజేష్ డైలాగ్స్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.


స్కూల్లో చిగురించిన ప్రేమ కాలేజీ కి వెళ్ళాక ఎలా మారుతుంది? అనే కాన్సెప్ట్ తో యువతరాన్ని ఆకట్టుకునేలా ఈ సినిమాని తెరకెక్కించారు సాయి రాజేష్. దీంతో యూత్  కి 'బేబీ' బాగా కనెక్ట్ అయింది. ఇక థియేటర్స్ లో సెన్సేషనల్ హిట్ ని అందుకున్న ఈ మూవీ రీసెంట్ గా ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనూ రికార్డ్స్ క్రియేట్ చేసింది. 'ఆహా' ఓటీటీ లో ఆగస్టు 25న విడుదలైన 'బేబీ' అత్యధిక వ్యూస్ అందుకుంది. ఇక ఇప్పుడు టీవీల్లోకి సందడి చేసేందుకు సిద్ధమైంది. 'బేబీ' మూవీ సాటిలైట్స్ రైట్స్ ని  ఈటీవీ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. నిజానికి కొత్త సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేసే విషయంలో ఈటీవీ కాస్త వెనుకంజలో ఉంటుందనే సంగతి తెలిసిందే.


మామూలుగా తెలుగు చిత్రాల శాటిలైట్ హక్కుల కొనుగోలులో స్టార్ మా, జీ తెలుగు, జెమిని వంటి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ మధ్యే ఎక్కువగా పోటీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈటీవీ మిగతా ఛానల్స్ తో పోటీ పడి మరీ 'బేబీ' హక్కులను చేజిక్కించుకోవడం విశేషం. ఈ క్రమంలోనే 'బేబీ' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సెప్టెంబర్ 24, ఆదివారం 5:30 నిమిషాలకు ఈటీవీ ఛానల్ లో ప్రసారం కానుంది. ఇన్ని రోజులు ఓటీటీలో ప్రేక్షకుల్ని అలరించిన 'బేబీ' ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు రాబోతుండడంతో బుల్లితెర ఆడియన్స్ సైతం ఈ సినిమా కోసం ఆసక్తి ఎదురుచూస్తున్నారు.


మరి థియేటర్స్ తో పాటూ ఓటీటీ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన 'బేబీ' ఇప్పుడు బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన వైష్ణవి చైతన్యకి ఇప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ హీరోయిన్ కి ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం. దాంతోపాటు అల్లు శిరీష్, సిద్దు జొన్నలగడ్డ వంటి యంగ్ హీరోల సరసన కూడా  నటించే ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.


Also Read : బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా కూడా ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యానే - ఎవరిని కలిసినా అదే ప్రశ్న అంటూ



Join Us on Telegram: https://t.me/abpdesamofficial