Oye Re-Release: వాలంటైన్స్ డే సందర్భంగా రీ రిలీజ్ అయిన సిద్దార్థ్ మూవీ ‘ఓయ్’కి ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభిస్తోంది.  సినిమాను చూసేందుకు సినీ అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. హైదరాబాద్, వైజాగ్ తో పాటు ఈ సినిమా విడుదలైన ప్రతి చోటా థియేటర్లకు ప్రేక్షకులు తరలి వస్తున్నారు. 2009లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అనుకున్న స్థాయిలో ఆదరణ లభించకపోయినా, రీ రిలీజ్ సందర్భంగా చాలా చోట్ల షోలు చాలా చోట్ల హౌస్ ఫుల్ అవుతున్నాయి. అన్ని చోట్ల ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. దీనితో దర్శకుడు ఆనంద్ రంగా, హీరో సిద్దార్థ్ సంతోషం వ్యక్తం చేశారు. 


అభిమానులతో కలిసి సినిమా చూసిన సిద్దార్థ్


తాజాగా దర్శకుడు ఆనంద్ రంగా, హీరో సిద్దార్థ్ నేరుగా అభిమానులతో కలిసి ఈ సినిమాను చూశారు. హైదరాబాద్ శాంతి థియేటర్ స్క్రీనింగ్ లో పాల్గొన్నారు. థియేటర్ దగ్గర వారికి ఘన స్వాగతం లభించింది. అనంతరం అభిమానులతో కలిసి సినిమా చూశారు. ఆడియెన్స్ నుంచి వచ్చిన స్పందన చూసి ఫుల్ ఖుషీ అయ్యారు. ఆ తర్వాత సిద్దార్థ్ అభిమానులతో ముచ్చటించాడు. సినిమాను ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పాట పాడటంతో అభిమానులు మరింత ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.














శాంతి థియేటర్ లో సిద్దార్థ్ కు చేదు అనుభవం


అటు సినిమా చూసి బయటకు వెళ్తున్న సమయంలో సిద్దార్థ్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. అభిమానులు ఆయనను చూసేందుకు ఎగబడటంతో తోపులాట జరిగింది. ఈ ఘటనతో సిద్దార్థ్ ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ అభిమానులను ఆయన ఏం అనలేదు. ఆ క్రౌడ్ నుంచి నెమ్మదిగా బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.






2009లో ప్రేక్షకులను అలరించని ‘ఓయ్’


నిజానికి  2009లో రిలీజైన ‘ఓయ్’ అప్పుడు అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. కావాల్సినంత ఎమోషన్ ఉన్నా, అభిమానులకు అంతగా ఎక్కలేదు. సిద్దార్థ్ తన భావోద్వేగాలను గొప్పగా ప్రదర్శించినా, ఆనుకున్న స్థాయిలో ఆడియెన్స్ ఆదరించలేదు. ఈ సినిమా తర్వాత దర్శకుడు ఆనంద్ రంగా మరో సినిమా చేయలేదు. ఈ సినిమాకు అప్పుడు పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా, రీ రిలీజ్ లో మాత్రం ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నిజానికి నటుడు సిద్దార్థ్‌ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్లన్నీ తెలుగులోనే వచ్చాయి. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత ‘బొమ్మరిల్లు’తో మరో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. అనంతరం ఆయన నటించిన మరికొన్ని సినిమాలు కూడా బాగానే ఆడాయి. కానీ, కొంత కాలం తర్వాత డిజాస్టర్లు ఎదురయ్యాయి. ’మహాసముద్రం’, ‘చిన్నా’ లాంటి సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేదు.  


Read Also: లేటు వయసులో లేచిపోవడం ఏమిటో - రాజేంద్ర ప్రసాద్, జయప్రదల ‘లవ్ @ 65’ ట్రైలర్ చూశారా?