తెలుగు బుల్లితెర వీక్షకులకు 'బిగ్ బాస్' అంటే నాగార్జున! నాగార్జున అంటే 'బిగ్ బాస్'. ఆ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ అయ్యింది. అందులో మరో మాటకు తావు లేదు. ఎటువంటి సందేహాలు అవసరం లేదు. 'బిగ్ బాస్' ఫస్ట్ సీజన్ హోస్ట్ యంగ్  టైగర్ ఎన్టీఆర్ అయితే... రెండో సీజన్ హోస్ట్ నేచురల్ స్టార్ నాని! ఆ తర్వాత సీజన్స్ అన్నిటికీ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హోస్ట్ చేశారు.


నాగార్జున బదులు రానా దగ్గుబాటి?
ఇప్పటి వరకు తెలుగులో ఆరు సీజన్లను 'బిగ్ బాస్' రియాలిటీ షో (Bigg Boss Telugu) విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలో ఏడో సీజన్ స్టార్ట్ కానుంది. అయితే... ఈసారి నాగార్జున బదులు రానా దగ్గుబాటి (Rana Daggubati) హోస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. అందులో అసలు నిజం లేదని 'బిగ్ బాస్' తెలుగు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. అదంతా పుకారు మాత్రమేనని కొట్టి పారేశారు. 


Bigg Boss Telugu 7 Host : 'బిగ్ బాస్ 7'కు కూడా నాగార్జున హోస్ట్ చేస్తారని చాలా స్పష్టంగా చెప్పారు. సో... ప్రస్తుతానికి అక్కినేని నాగార్జున స్థానంలో మరొకరిని ఊహించుకోవాల్సిన అవసరం లేదు.


సెప్టెంబర్ తొలి వారంలో మొదలు!
Bigg Boss Telugu 7 Launch Date : సెప్టెంబర్ మొదటి వారంలో 'బిగ్ బాస్ 7' మొదలు అవుతుందని తెలిసింది. సెప్టెంబర్ 2 లేదా 3వ తేదీన లాంచింగ్ ఎపిసోడ్ ఉండే అవకాశాలు ఎక్కువ. 


'బిగ్ బాస్ 7' ప్రోమో వచ్చేసిందోచ్
Bigg Boss Telugu 7 Promo : స్టార్ మా ఛానల్ 'బిగ్ బాస్ 7' ప్రోమో విడుదల చేసింది. BB7తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని పేర్కొంది. ఈసారి ఎమోషన్స్, సర్ప్రైజెస్, థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో కూడిన రోలర్ కోస్టర్ రైడ్ పక్కా అని చెప్పింది. సరదా గొడవల నుంచి హృదయాన్ని కదిలించే కథల వరకు... 'బిగ్ బాస్ 7' ఇంటిలో అడగడుగునా ప్రేక్షకుల్ని అలరించే అంశాలు ఉంటాయని హామీ ఇచ్చింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రోమో విడుదల చేయడంతో జనాలు ఆశ్చర్యపోయారు.


Also Read బాలకృష్ణ అభిమాని... కలకత్తా వెళ్లి మరీ మార్టినెజ్‌తో ఫోటో, ఎవరీ మార్టినెజ్‌?


'బిగ్ బాస్' ఇంటిలో అడుగు పెట్టేదెవరు?
'బిగ్ బాస్ 7' ప్రోమో ఇలా వచ్చిందో? లేదో? అప్పుడే బిగ్ బాస్ ఇంటిలో అడుగు పెట్టె సెలబ్రెటీలు ఎవరు? అని చర్చ మొదలైంది. 'ఈటీవీ' ప్రభాకర్, 'కార్తీక దీపం' సీరియల్‌లో డాక్టర్ బాబును ప్రేమించిన మోనిత పాత్రలో నటించిన శోభా శెట్టి, 'బుల్లెట్ బండి' సాంగ్ ఫేమ్ మోహన భోగరాజు, 'ఢీ' షోలో 'నక్కిలీసు గొలుసు' పాటతో పాపులరైన డ్యాన్సర్ కమ్ కొరియోగ్రాఫర్ పండు, బుల్లితెరపై లవ్లీ జోడీ అమర్ దీప్, తేజస్విని తదితరులు వెళ్లవచ్చని తెలుస్తోంది. 


'బిగ్ బాస్' తెలుగు ఆరో సీజన్ ఆశించిన రేటింగ్స్ అందుకోలేదు. అందుకని, స్టార్ మా ఛానల్ యాజమాన్యం, షో నిర్వాహకులు ఇంటిలో అడుగు పెట్టే కంటెస్టెంట్లతో పాటు థీమ్ & స్కిట్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టిందట. సరికొత్త కొత్త టాస్కులతో గేమ్ ప్లాన్ చేశారట. 


Also Read సుజీత్ స్పీడును ఆపేదెవరు? - హైదరాబాద్‌లో పవన్ 'ఓజీ'!




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial