దర్శకుడు సుజీత్ (Sujeeth Director) స్పీడు మామూలుగా లేదు. ఆయన జోరును ఆపేదెవరు? అన్నట్లు ఉంది పరిస్థితి. తన అభిమాన కథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో సుజీత్ తీస్తున్న సినిమా 'ఓజీ' (OG Movie). 'దే కాల్ హిమ్ ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' అనేది ఉపశీర్షిక. ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే...
రాజకీయ యాత్రలో పవన్ బిజీ...
'ఓజీ' షూటింగులో సుజీత్ బిజీ!
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రలో బిజీ బిజీగా ఉన్నారు. అయినా సరే... సుజీత్ చకచకా షూటింగ్ చేసుకుంటూ వెళుతున్నారు. పవన్ కళ్యాణ్ అవసరం లేని సన్నివేశాలను తీసేస్తున్నారు.
హైదరాబాద్ (OG Movie Fourth Schedule)లో 'ఓజీ' నాలుగో షెడ్యూల్ మొదలు పెట్టామని చిత్రబృందం ఈ రోజు వెల్లడించింది. ప్రధాన తారాగణం అందరూ చిత్రీకరణలో పాల్గొంటున్నారని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పేర్కొంది. మాఫియా నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రమిది.
'ఓజీ' సినిమాలో శ్రియా రెడ్డి కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. 'సలార్' తర్వాత ఆమె చేస్తున్న చిత్రమిది. నిజం చెప్పాలంటే... 'సలార్' సినిమా చేయాలని శ్రియా రెడ్డి అనుకోలేదట. ఆ ఒక్క సినిమా చేసి మళ్ళీ నటనకు ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటే... తనకు స్క్రిప్ట్ విపరీతంగా నచ్చడంతో 'ఓజీ' ఓకే చేశానని ఆమె చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమా ఒక్కటి కూడా చూడలేదని ఆమె చెప్పారు.
Also Read : మంగళవారం హైదరాబాద్‌లో దిగిన దీపికా పదుకోన్ - ఎందుకంటే?
'ఓజీ' సినిమా గురించి శ్రియా రెడ్డి మాట్లాడుతూ ''నాకు సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ గారు బాగా తెలుసు. నా చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. దర్శకుడు సుజీత్ ఫోన్ చేస్తారని, మాట్లాడమని చెప్పారు. సుజీత్ ఫోన్ చేసి ఐదారు నిమిషాలు మాట్లాడిన తర్వాత 'ఓజీ' చేయాలని ఫిక్స్ అయ్యా. కథ అంత బాగా నచ్చింది. 'ఓజీ' ఓకే చేయడానికి మొదటి కారణం స్క్రిప్ట్. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ గారు'' అని చెప్పారు.
Also Read : బాలకృష్ణ అభిమాని... కలకత్తా వెళ్లి మరీ మార్టినెజ్‌తో ఫోటో, ఎవరీ మార్టినెజ్?
ప్రేక్షకుల ఊహలన్నీ తప్పే!
'ఓజీ' సినిమాలో హిందీ హీరో ఇమ్రాన్ హష్మీ, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, తమిళ నటుడు అర్జున్ దాస్... ఇలా భారీ తారాగణం ఉంది. శ్రియా రెడ్డి పేరు బయటకు రావడంతో వారిలో ఎవరో ఒకరికి జోడిగా ఆమె నటిస్తున్నారని ప్రేక్షకులు ఊహిస్తున్నారని, కామెంట్స్ చేస్తున్నారని... ఆ ఊహలన్నీ తప్పేనని శ్రియా రెడ్డి తెలిపారు. తన క్యారెక్టర్ ఏమిటనేది సినిమా చూస్తే తెలుస్తుందన్నారు.
పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంకా అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'నాటు నాటు...'కు ఆస్కార్ అందుకున్న 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial