శ్రీదేవిని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ పెళ్లి చేసుకున్నారు. సహజ నటి జయసుధ భర్త నితిన్ కపూర్ కూడా బాలీవుడ్ నిర్మాత. ఈ బాటలో మరో అందాల భామ ఓ నిర్మాతను పెళ్లాడబోతోంది. ఆవిడ 'బిగ్ బాస్' భామ శుభశ్రీ రాయగురు. 

నిర్మాత అజయ్ మైసూర్‌తో శుభశ్రీ నిశ్చితార్థం!'బిగ్ బాస్ 7'తో శుభ శ్రీ తెలుగునాట పాపులర్ అయ్యారు. ఆ రియాలిటీ షో కంటే ముందు ఆవిడ కొన్ని సినిమాల్లో హీరోయిన్ రోల్స్ కూడా చేశారు. ఆవిడ త్వరలో ఏడు అడుగులు వేయబోతున్నారు.

రామ్ గోపాల్ వర్మతో 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమా చేసిన ప్రొడ్యూసర్ అజయ్ మైసూర్ గుర్తు ఉన్నారా? అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్ పతాకం మీద ఆ సినిమాతో పాటు '10th క్లాస్ డైరీస్' కూడా ప్రొడ్యూస్ చేశారు. ఆ రెండు చిత్రాలతో పాటు పలు షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ అల్బమ్స్‌లో ఆయన నటించారు. అతి త్వరలో శుభశ్రీ రాయగురుతో అజయ్ మైసూర్ ఏడు అడుగులు వేయనున్నారు.

ఘనంగా అజయ్ మైసూర్, శుభశ్రీ నిశ్చితార్థ వేడుక!జూన్ 5వ తేదీ (శుక్రవారం) హైదరాబాద్ శివార్లలోని ఒక రిసార్ట్‌లో అజయ్ మైసూర్ - 'బిగ్ బాస్ 7' ఫేమ్ శుభశ్రీ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు సాయి కుమార్, యువ కథానాయకుడు సోహైల్, 'బిగ్ బాస్' కంటెస్టెంట్లతో పాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. కాబోయే కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Also Read'హౌస్‌ ఫుల్ 5' రివ్యూ: అడల్ట్ జోక్స్, హీరోయిన్స్ గ్లామర్ షో నమ్ముకున్న సినిమా... తెలుగు ప్రేక్షకులకు అక్షయ్ కుమార్ సినిమా నచ్చుతుందా? ఇది హిట్టా? ఫట్టా?

నిశ్చితార్థ వేడుకలో అజయ్ మైసూర్, శుభ శ్రీ రాయగురు కలిసి చేసిన 'మెజెస్టీ ఇన్ లవ్' సాంగ్ లాంఛ్ చేశారు. సాయి కుమార్ వాయిస్ ఓవర్‌తో పాట మొదలైంది. సిద్ధార్థ్ వాట్కిన్స్ మ్యూజిక్ అందించడంతో పాటు సింగర్ సాహితి చాగంటితో కలిసి ఈ పాట పాడారు. ఈ సాంగ్ చేసేటప్పుడు అజయ్ మైసూర్, శుభశ్రీ ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. జూలైలో ఆస్ట్రేలియాలో పెళ్లి జరగనుందని తెలిపారు.

Also Readఘనంగా అఖిల్ పెళ్లి... చిరంజీవి, చరణ్ to ప్రశాంత్ నీల్, తిలక్ వర్మ... అక్కినేని ఇంట స్టార్స్ సందడి... ఎవరెవరు వచ్చారో చూడండి

నిశ్చితార్థ వేడుకలో నటులు సాయి కుమార్ మాట్లాడుతూ... ''అజయ్ మైసూర్ నాకు మంచి ఫ్రెండ్. ఈ జంట చిరకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా'' అని శుభాకాంక్షలు తెలిపారు. హీరో సోహైల్, 'బిగ్ బాస్' కంటెస్టెంట్లతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.