Gunasekhar Bhumika Euphoria Moviie Release Date: చాలా రోజుల తర్వాత టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భూమిక ప్రధాన పాత్రలో నటిస్తోన్న యూత్ ఫుల్ సోషల్ డ్రామా 'యుఫోరియా'. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ మూవీని తెరకెక్కిస్తుండగా... దీపావళి సందర్భంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.

Continues below advertisement


క్రిస్మస్ బరిలో


క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు. 'నేటి యూత్ ట్రెండ్‌కు అనుగుణంగా, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే విధంగా డిఫరెంట్ స్టోరీతో రూపొందిన మూవీ యుఫోరియా. దీంట్లో ఓ చక్కని మెసేజ్ ఉంది. ఇందులో భూమిక రోల్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది.' అంటూ రాసుకొచ్చారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత హిట్ కాంబో రిపీట్ అవుతుండడంతో 'యుఫోరియా' అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది.


టైటిల్ కూడా డిఫరెంట్‌గా ఉండడంతో స్టోరీ ఏంటా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో 2003లో రిలీజ్ అయిన 'ఒక్కడు' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ మూవీలో భూమిక హీరోయిన్‌గా నటించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత గుణశేఖర్‌ మూవీలో నటిస్తున్నారు.


Also Read: శివంగిలా సన్నీ లియోన్... 'త్రిముఖ' సినిమాలో రోల్ అదే - టీజర్ చూశారా?


మూవీలో భూమికతో పాటు సారా అర్జున్, రోహిత్, నాజర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లిఖిత యలమంచిలి, పృథ్వీరాజ్ అడ్డాల, కల్పలత, సాయి శ్రీనికరెడ్డి, విఘ్నేష్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గుణశేఖర్ హోమ్ బ్యానర్ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.


ఒకే రోజు 4 సినిమాలు


ఈ క్రిస్మస్‌కు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. ఒకే రోజు 4 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సన్, జాతిరత్నాలు ఫేం అనుదీప్ దర్శకత్వంలో లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'ఫంకీ' క్రిస్మస్‌కు రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించారు. సీనియర్ హీరో నరేష్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.


దీంతో పాటు మరో యంగ్ డైనమిక్ హీరో రోషన్ మేక ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా 'ఛాంపియన్' డిసెంబర్ 25నే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తుండగా... స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిం బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 


ఇక ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకునే యంగ్ హీరో ఆది సాయికుమార్ లేటెస్ట్ సూపర్ నేచర్ థ్రిల్లర్ 'శంబాల' కూడా డిసెంబర్ 25నే రిలీజ్ కానుంది. ఈ మూవీకి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తుండగా... అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రవివర్మ, స్వాసిక, మధునందన్, శివకార్తీక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మొత్తానికి ఈ క్రిస్మస్‌కు ఏ బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందో చూడాల్సి ఉంది.