ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) కొన్ని నెలల క్రితం ఒక కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. 'యుఫోరియా' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటి భూమిక హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబో రిపీట్ కాగా, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని రిలీజ్ చేశారు డైరెక్టర్ గుణశేఖర్.
'యుఫోరియా' సినిమాలో భూమిక హీరోయిన్ గా నటిస్తుండగా, గుణశేఖర్ హోమ్ బ్యానర్ గుణ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నీలిమ గుణ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలైంది అంటూ తాజాగా అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 20 ఏళ్ల తరువాత మరోసారి మొదలైన జర్నీ అంటూ షూటింగ్ కు సంబంధించిన ఓ చిన్న వీడియోను రిలీజ్ చేయగా, అందులో భూమిక మేకప్ వేసుకోవడం దగ్గర నుంచి... షూటింగ్ జరగడం దాకా ఉన్న బిటిఎస్ సీన్స్ ను చూపించారు. ఇక ఈ సినిమాను గుణశేఖర్ ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని సరికొత్త పాయింట్ తో తెరపైకి తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. యూత్ ఫుల్ సోషల్ డ్రామాగా ఈ 'యుఫోరియా' మూవీ తెరకెక్కుతున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వీరి కాంబో రిపీట్ అవుతుండడం మరో విశేషం.
గతంలో డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన 'ఒక్కడు' అనే బ్లాక్ బస్టర్ మూవీలో భూమిక హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అటు మహేష్ బాబుతో పాటు ఇటు భూమిక, గుణశేఖర్ కి కూడా టర్నింగ్ పాయింట్ గా మారింది. ఆ మూవీ తర్వాత గుణశేఖర్ ఆ రేంజ్ సక్సెస్ ని ఇప్పటిదాకా చూడలేదని చెప్పాలి. గత సినిమా 'శాకుంతలం'తో ఫ్లాప్ అందుకున్న గుణశేఖర్... కాస్త గ్యాప్ ఇచ్చి ఈ 'యుఫోరియా' సినిమాను మొదలు పెట్టాడు. నిజానికి 'శాకుంతలం సినిమా మీద గుణశేఖర్ తో పాటు సమంత కూడా ఆశలన్నీ పెట్టుకున్నారు. పైగా ఈ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది. మరి ఇప్పుడు ఈ 'యుఫోరియా'మూవీ, భూమిక సెంటిమెంట్ ఆయనకు మళ్ళీ అదృష్టాన్ని తీసుకొస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: నాగ చైతన్య - శోభిత పెళ్లి... ముహూర్తం, వేదిక నుంచి అతిథులు వరకు - ఈ వివరాలు తెల్సా?
మరోవైపు భూమిక రీ ఎంట్రీ తర్వాత పలు సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తోంది. చివరగా ఆమె అనుపమ పరమేశ్వరన్ తో కలిసి 'బటర్ ఫ్లై' అనే సినిమాలో నటించింది. అలాగే కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించిన 'ఎమర్జెన్సీ' మూవీలో కూడా భూమిక కీలకపాత్రను పోషించింది. ఇదిలా ఉండగా మరోవైపు గోవాలో సమర వెల్నెస్ అనే పేరుతో హోటల్ ను ప్రారంభించి, వ్యాపార రంగంలోకి కూడా భూమిక అడుగు పెట్టింది. ఇలా భూమిక ఓ వైపు సినిమాలు, మరోవైపు బిజినెస్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బిజీ బిజీగా గడిపేస్తోంది.