తెలుగు టీవీ షోలు చూసే ఆడియన్స్‌కు, మరీ ముఖ్యంగా 'జబర్దస్త్' వీక్షకులకు ఇమ్మాన్యుయేల్ (Jabardasth Emmanuel) తెలుసు అని చెప్పాలి. ఇప్పుడు 'బిగ్ బాస్' కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. అలాగే, యాదమ్మ రాజు (Yadamma Raju), 'గల్లీ బాయ్' భాస్కర్ సైతం బుల్లితెర వీక్షకులకు తప్పకుండా తెలిసే ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రూపొందుతోంది.


హారర్ సినిమాలో హీరోలుగా కమెడియన్లు!
యాదమ్మ రాజు, 'గల్లీ బాయ్' భాస్కర్, 'జబర్దస్త్' / 'బిగ్ బాస్' ఇమాన్యుయేల్, బల్వీర్ సింగ్, 'గడ్డం' నవీన్, పవన్ శెట్టి, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భూతం ప్రేతం' (BhooTham PrayTham Movie). ఇదొక హారర్ కామెడీ. సృజన ప్రొడక్షన్స్ పతాకంపై బి వెంకటేశ్వర రావు నిర్మించిన చిత్రమిది. రాజేష్ ధృవ దర్శకత్వం వహిస్తున్నారు. 






Anil Ravipudi launches BhooTham PrayTham First Look: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి 'భూతం ప్రేతం' సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ''యాదమ్మ రాజు, భాస్కర్ నాకు బాగా తెలుసు. వాళ్ళు నా టీం. టైటిల్, ఫస్ట్ లుక్ చాలా బావున్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.


Also Read'ఓజీ' రివ్యూ: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుందా? సినిమా హిట్టా? ఫట్టా?


'భూతం ప్రేతం' హారర్ కామెడీ సినిమా. భూతానికి చిక్కిన ఐదుగురు కుర్రాళ్లు దాన్నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి ఏ విధంగా ప్రే చేశారు (ప్రార్ధించారు)? భూతం నుంచి ఎలా బయట పడ్డారు? అనేది సినిమా. నవ్విస్తూ భయపెట్టే చిత్రమిది. 


Also Read'ఓజీ' సీక్వెల్ ఉందండోయ్... అప్పుడే అయిపోయిందనుకోకు... నెక్ట్స్ జపాన్‌లో ఊచకోత!






Bhootham Praytham Cast And Crew: యాదమ్మ రాజు, గల్లీ బాయ్' భాస్కర్, 'బిగ్ బాస్ 9' ఇమాన్యుయేల్, బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, పవన్ శెట్టి, రాజేష్ ధృవ, రాధిక అచ్యుత్ రావు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కూర్పు: ఉజ్వల్ చంద్ర, సహ రచయిత - సంభాషణలు: షంషీర్, ప్రొడక్షన్ డిజైనర్ & కో డైరెక్టర్: రాధికా అచ్యుత్‌ రావు, కళ: దేవి ప్రకాష్ శెట్టి, ఛాయాగ్రహణం: యోగేష్ గౌడ, సంగీతం: గిరీష్ హోతుర్, నిర్మాణ సంస్థ: సృజన ప్రొడక్షన్స్, నిర్మాత: బి వెంకటేశ్వర రావు, దర్శకుడు: రాజేష్ ధృవ.