స్వర్గ లోకంలో కొలువై ఉండే ఇంద్రుడు ఒక రోజు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళాడు. ఆయనతో పాటు నారదముని కూడా! శేష పాన్పుపై విష్ణుమూర్తి సేద తీరుతున్నారు. ఆయనతో ''కలి యుగంలో రాక్షసులు భువిపైకి అవతరించబోతున్నారు. అట్టి రాక్షసుల నుంచి కాపాడండి'' అని ఇంద్రుడు వేడుకొంటారు. అప్పుడు  ఆయనకు అభయం ఇస్తూ... ''చింతించకు ఇంద్రదేవా! కలియుగంబున భువిపై జనియించి, ఏ ఉపద్రవం తలెత్తకుండా చూసెదను'' అని నారాయణుడు చెబుతారు. ఆ తర్వాత స్క్రీన్ మీదకు హీరో శివ కందుకూరి వచ్చారు. ఇదీ 'భూతద్ధం భాస్కర్‌ నారాయణ' సినిమా ఫస్ట్ గ్లింప్స్‌. ఇన్నోవేటివ్‌గా ఉన్న ఈ గ్లింప్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శివ కందుకూరి కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'భూతద్ధం భాస్కర్‌ నారాయణ' (Bhootadham Bhaskar Narayana Movie). పురుషోత్తం రాజ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రాశి సింగ్‌ (Rashi Singh) కథానాయిక. రీసెంట్‌గా ఫస్ట్ గ్లింప్స్‌ విడుదల చేశారు. 'భూతద్ధం భాస్కర్‌ నారాయణ' ఫస్ట్ గ్లింప్స్‌ చూస్తే... లుంగీ కట్టుకుని, నల్ల కళ్లజోడు పెట్టుకుని, రివాల్వర్‌తో పోలీస్‌ జీపు నుంచి దిగిన శివ కందుకూరి స్టైల్‌గా కనిపించారు. వాటర్ హీటర్‌తో సిగరెట్ వెలిగించుకోవడం ప్రేక్షకులు నోటీస్ చేసేలా ఉంది. మైథాలజీ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాంశంతో సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. 

''గ్రామీణ వాతావరణం నేపథ్యంలో సాగే ఒక డిటెక్టివ్‌ కథతో 'భూతద్ధం భాస్కర్‌ నారాయణ' రూపొందుతోంది. థ్రిల్‌ కలిగించే ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌ విడుదల చేయడంతో పాటు విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని నిర్మాతలు పేర్కొన్నారు.

Also Read : నాగ చైతన్య నవ్వితే డేటింగ్‌లో ఉన్నట్టేనా? ఆమెతో ప్రేమ నిజమేనా?

అరుణ్‌, దేవీప్రసాద్‌, వర్షిణి, శివకుమార్‌, షఫీ, శివన్నారాయణ, కల్పలత, రూప లక్ష్మి, అంబటి శ్రీను, చైతన్య, వెంకటేశ్‌ కాకుమాను, ప్రణవి, దివిజ, ప్రభాకర్‌, కమల్‌, గురురాజ్‌ తదితరుల నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించారు.

Also Read : సెక్యూరిటీ పెంచిన సల్మాన్ ఖాన్ - సేఫ్టీకిగన్ లైసెన్స్, ఇప్పుడు కారుకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్