Bhola Mania Song Promo : భోళా శంకరుడి మేనియా షురూ - ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతోన్న 'భోళా శంకర్' సినిమాలో ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల అయ్యింది. ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?

Continues below advertisement

సంక్రాంతి విడుదలైన 'వాల్తేరు వీరయ్య' విజయం అందించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). ఇప్పుడు ఆయన హీరోగా స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ 'భోళా మేనియా' ప్రోమో ఈ రోజు విడుదల చేశారు. అందులో లిరిక్స్ ఏమీ లేవు. కానీ, మ్యూజిక్ బిట్ మాత్రం బావుంది. 

Continues below advertisement

జూన్ 4న ఫుల్ సాంగ్!
Bhola Mania Full Song Release Date : 'భోళా మేనియా' ఫుల్ సాంగును ఈ నెల 4న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. చిరంజీవి, సంగీత దర్శకుడు మణిశర్మలది సూపర్ హిట్ కాంబినేషన్. అయితే, ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన మ్యూజిక్ ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహతి కెరీర్ చూస్తే మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. అయితే, చిరు లాంటి అగ్ర హీరో సినిమాకు ఇప్పటి వరకు ఆయన సంగీతం ఇవ్వలేదు.

Also Read : 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

ఏపీలో 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ వేడుక!
'భోళా శంకర్' సినిమా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అంత కంటే ముందు అభిమానుల సమక్షంలో విజయవాడలో భారీ ఎత్తున 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని నిర్ణయించినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలిసింది. 'భోళా శంకర్' నిర్మాత, ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకరకు సైతం విజయవాడ అంటే సెంటిమెంట్! ఆయన ఓ నిర్మాతగా చేసిన మహేష్ బాబు 'దూకుడు' సక్సెస్ మీట్ కూడా ఆ సిటీలో నిర్వహించారు. అదీ సంగతి! ఇటీవల 'భోళా శంకర్' టీమ్ స్విట్జర్లాండ్ నుంచి తిరిగొచ్చింది. 

స్విస్ కొండల్లో సాంగ్!
'భోళా శంకర్'లో చిరంజీవి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah) నటిస్తున్నారు. స్విట్జర్లాండ్ మంచు కొండల్లో హీరో హీరోయిన్లపై రొమాంటిక్ డ్యూయెట్ ఒకటి తెరకెక్కించారు. ఆ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

స్విట్జర్లాండ్ (Switzerland)లో 'భోళా శంకర్' సాంగ్ షూటింగ్ కంప్లీట్ కావడంతో తమ యూనిట్ ఇండియా రిటర్న్ అయ్యిందని మెహర్ రమేష్ పేర్కొన్నారు. పాట చాలా అందంగా వచ్చిందని ఆయన తెలిపారు. అదే సమయంలో అక్కడ చిత్రీకరణ చేయడం చాలా కష్టమని ఆయన చెప్పుకొచ్చారు. యువ సంగీత దర్శకుడు సాగర్ మహతి అందించిన బాణీకి శేఖర్ మాస్టర్ అద్భుతమైన కొరియోగ్రఫీ చేయగా... సినిమాటోగ్రాఫర్ డడ్లీ అందంగా తెరకెక్కించారని మెహర్ రమేష్ ట్వీట్ చేశారు. అదీ సంగతి!

Also Read : 'వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ రికార్డ్స్'లో ఎఫ్‌టిపిసి ఎన్టీఆర్ అవార్డ్స్

ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావుకు చెందిన క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ  నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో చిరంజీవి సోదరిగా కీర్తీ సురేష్ నటిస్తున్నారు. ఏయన్నార్ మనవడు, నాగార్జున మేనల్లుడు, యువ హీరో సుశాంత్ కూడా సినిమాలో ఉన్నారు. ఆయన కీర్తీ సురేష్ జంటగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే, ఆ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేయలేదు.

Continues below advertisement