నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'అనగనగా ఒక రాజు' (Anaganaga Oka Raju). ఆయన సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై రూపొందుతోంది. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న సినిమా విడుదల అవుతోంది. ఇందులోని మొదట పాట 'భీమవరం బల్మా...'ను తాజాగా విడుదల చేశారు.
గాయకుడిగా నవీన్ పోలిశెట్టి...
ట్రెండీ పాట 'భీమవరం బల్మా'తో!
'అనగనగా ఒక రాజు' సినిమాలోని మొదటి పాట 'భీమవరం బల్మా...' స్పెషాలిటీ ఏమిటంటే... ఈ పాటను హీరో నవీన్ పోలిశెట్టి స్వయంగా పాడటం. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడు. ఆయన స్వరపరిచిన 'భీమవరం బల్మా...' పాటకు ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ సాహిత్యం అందించారు. నవీన్ పోలిశెట్టితో పాటు నూతన మోహన్ ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ లిరిక్స్ చూస్తే...
చాట్ జీపీటీ.. ఎవరే ఈ బ్యూటీ...
ఇంతందంగుందేంటీ హాయ్..
డ్రెస్‌లు ఒక్కోటి.. వెలకడితే కోటి...
ఏ కిస్కీ బేటీ హై భాయ్!
ల్యాగంటూ లేని నీ స్వాగుకి పడిపోనా ఏంటి ఆయ్..
కారేమో బెంజి...
ప్యారేమో జెన్ జీ...
స్టోరీ మొదలెట్టేదామా? ఆ ఆ ఆ..
భీమవరం బాల్మా... బాగ బీచ్ పోదమా?
మీద మీద ఫాల్మా... వైరలవుద్ది రీల్‌మా (2)
గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా
గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా
చాట్ జీపీటీ... ఎవరే ఈ బ్యూటీ...
ఇంతందంగుందేంటీ హాయ్..
డ్రెస్‌లు ఒక్కోటి... వెలకడితే కోటి...
ఏ కిస్కీ బేటీ హై భాయ్!
చరణం
నిన్ను.. నన్ను.. చూసినోళ్లు.. కల్టు పెయిరు అని పేరెడతారు
నువ్వు.. నేను.. స్టెప్పులేస్తే.. హుక్కు స్టెప్పులుగా మార్చేస్తరు..
హే.. వెంట వస్తా.. పడి పడి పడి పడి
నువ్వే నా బెస్ట్ బడ్డీ బడ్డీ బడ్డీ బడ్డీ
చేరనా నీ ఒడి ఒడి ఒడి ఒడిలో..
నే రెడీ రెడీ గా
హే చెయ్ రైట్ స్వైపు.. పెంచేద్దాం హైపు..
లవ్ బాంబు పేల్చేద్దామా.. ఆ ఆ ఆ ఆ..
భీమవరం బాల్మా.. బాగ బీచ్ పోదమా?
మీద మీద ఫాల్మా.. వైరలవుద్ది రీల్‌మా (2)
గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా (2)
'భీమవరం బల్మా...' పాటను భీమవరంలో విడుదల చేశారు. అక్కడ నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ... ''ప్రేక్షకుల ప్రేమ వల్లే నేను ఈ స్థాయి వరకు వచ్చా. నా లాస్ట్ 3 సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. నాకు ఇంజ్యూరీ కావడం వల్ల కొంత కాలం షూటింగులకు దూరమయ్యా. ప్రేక్షకుల ప్రేమ, మద్దతు వల్లే కోలుకొని మళ్ళీ 'అనగనగా ఒక రాజు' షూటింగ్ చేసి సంక్రాంతికి విడుదల చేస్తున్నాం. మీ ప్రేమ వల్లే తొలిసారి ఓ పాట పాడాను. కామెడీ, మాస్ మూమెంట్స్, కమర్షియల్ సాంగ్స్, అద్భుతమైన ప్రేమ కథ... ఈ సినిమాలో అవన్నీ ఉంటాయి. జనవరి 14న థియేటర్లలో అందరం హాయిగా నవ్వుకుందాం" అని అన్నారు.