బిగ్ బాస్ డే 80 రోజు రాత్రి యావర్ కు వెల్కమ్ పలికారు హౌస్ మేట్స్. వస్తూనే "తనూజా నీకు లవర్ ఉన్నాడా?" అని అడిగాడు. ఆమె "లేడు" అనడంతో, "నాకు ఛాన్స్ ఉంటుంది కదా" అంటూ, మిగతా వాళ్ళని కూడా పలకరించాడు. "ఇప్పుడు ప్రపోజ్ చేస్తావా ?" ఏంటి అని రీతూ అడిగితే, "పాట కావాలి బిగ్ బాస్" అని అడిగి మరీ "ఎవరెవరో" సాంగ్ కు తనూజాతో రొమాంటిక్ డ్యాన్స్ చేసాడు. తనూజా కోసమే ఈ సాంగ్ నేర్చుకున్నా అని పాడి కూడా చూపించాడు. చివరి కెంప్టెన్సీలో భాగంగా "సెట్ ద ఫైర్" అనే టాస్క్ ఇచ్చారు. "మీ ముందున్న రోప్ మధ్యలో అడుగులు వేస్తూ, వాటిని దాటుకుంటూ వెళ్ళి, ఒకసారి ఒక పజిల్ పీసెస్ ఉన్న బ్యాగ్ ను మాత్రమే తీసుకుని, ఫజిల్ బోర్డులో అటాచ్ చేయాలి" అని వివరించారు బిగ్ బాస్. యావర్ ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఆడగా, ఈ టాస్క్ లో ఇమ్మూనే గెలిచాడు. :"ప్రతి టాస్క్ ఒక పంతం, ప్రతీరోజూ ఒక ఎమోషన్, ప్రతి వీకెండ్ ఒక తీర్పు...   ఇవన్నీ కలిపి ఒక మర్చిపోలేని జర్నీ" అని మోటివేట్ చేసి వెళ్ళిపోయాడు యావత్. 

Continues below advertisement

కొత్త రచ్చ మొదలెట్టిన సంజన 

అర్థరాత్రి "ఒమేగా, మల్టీ విటమిన్, కాల్షియం. మెగ్నీషియం టాబ్లెట్స్ అన్నీ తీసేశారు. ఎవరో తెలీదు కానీ మీరొకసారి చెప్పండి. నాకు కాల్షియం చాలా ముఖ్యం. నా వస్తువులను ఎక్కడ నుంచి తీసారో అక్కడే పెట్టమని చెప్పండి. లేదంటే తర్వాత పరిస్థితి వేరేగా ఉంటుంది" అని కెప్టెన్ రీతూకి కంప్లైంట్ చేశాడు భరణి. "సంజన తీయడం చూసాను" అని చెప్పింది తనూజా. కానీ ఆమె సంజన ఒప్పుకోలేదు. మరోవైపు "క్యూట్ గా ఉండు అన్నది కంపోజ్ గా ఉంటావని. ఏయ్ ఇలాంటివి వద్దు. నాకు తిక్కరేగితే ఆ వైబ్ వేరేగా ఉంటది" అని గట్టిగా చెప్పాడు భరణి దివ్యకు. అర్థరాత్రి "ఒక్క నిమిషం మాట్లాడాలి" అని భరణిని పిలిచింది సంజన. "దాచిపెట్టే మాట్లాడాల్సిన అవసరం లేదు" అని ఇమ్మూ అంటే, భరణి కూడా సంజనను పట్టించుకోలేదు. ఈ విషయంలో మళ్ళీ దివ్య, భరణి మధ్య వివాదం చోటు చేసుకుంది. మరునాడు ఉదయాన్నే ఇంత సీరియస్ అవుతారని నేను అనుకోలేదు అని టాబ్లెట్స్ ఇచ్చేసింది సంజన. ఫన్ కోసం చేస్తే మధ్యలో ఇమ్మూ వచ్చాడు, దివ్య ఏడ్చింది. చిరాకు అనిపించి వదిలేశా.

Continues below advertisement

Also Read: బిగ్‌బాస్ డే 79 రివ్యూ... మాట నిలబెట్టుకోలేకపోయిన భరణి... కొడుకు చెప్పినా కళ్ళు తెరవని సంజన... కళ్యాణ్‌కు గోల్డెన్ ఛాన్స్

శోభా శెట్టి, సోహెల్ ఎంట్రీ 

మధ్యాహ్నం సీజన్ 7 నుంచి శోభా శెట్టి ఎంట్రీ ఇచ్చి, దివ్యతో "చిక్కులు దిక్కులు లెక్కలు" టాస్క్ ఆడింది. ఇందులో దివ్యానే విన్ అయ్యింది. దీనికి భరణి సంచాలక్ గా చేశాడు. మెయిన్ గేట్ దగ్గర "చిల్ బ్రో" సాంగ్ కోసం స్టెప్పులేస్తూ కంటెస్టెంట్స్ ఎదురు చూస్తుంటే, స్టోర్ రూమ్ లో నుంచి సయ్యద్ సోహెల్ వచ్చి సర్ప్రైజ్ చేశాడు. "నాన్ వెజ్ లేకుండా ఎలా ఉన్నారు. 6 వారాలు మటన్, చికెన్ పెట్టలేదట మజాకా బిగ్ బాస్" అంటూ బిగ్ బాస్ ను చికెన్, పాలు, కాఫీ, అలాగే నా రికమండేషన్ దెయ్యాల సినిమాలు వేయండి" అని రిక్వెస్ట్ చేశాడు. ముందుగా ఆటపట్టించిన బిగ్ బాస్ చివరకు అడిగవన్నీ పంపారు. 

"కెప్టెన్ రూమ్ లో పిల్లో కింద కాఫీ ఉంది. తీసుకుని ఎంజాయ్ చేయండి" అని దొంగలు తనూజా, రీతూని బిగ్ బాస్ అడ్డంగా బుక్ చేశారు. రీతూ, సంజనా తో సోహెల్ "100 టైమ్స్ డిఫికల్టీ" అనే టాస్క్ ఆడారు. చివరికి కళ్యాణ్, పవన్, ఇమ్ము, దివ్య, సంజన, రీతూ ఆఖరి కెప్టెన్సీ పోటీకి కంటెండర్లుగా ఛాన్స్ పట్టేశారు.