TTD Followers Clarifies About Anchor Shiva Jyothi Aadhar Card Blocked For Srivari Darshan : రీసెంట్‌గా తిరుమల శ్రీవారి క్యూలైన్లలో ప్రసాదంపై అపహాస్యం చేసిన ఫేమస్ యాంకర్ శివజ్యోతి వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. 'రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం' అంటూ తను చేసిన కామెంట్స్‌పై ఆమె క్షమాపణలు చెబుతూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే, టీటీడీ శివజ్యోతిపై చర్యలు తీసుకుందనే ప్రచారమూ సాగింది.

Continues below advertisement

ఆ న్యూస్‌పై క్లారిటీ!

టీటీడీ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ చేసిందని... భవిష్యత్తులో ఆమె శ్రీవారి దర్శనం కూడా చేసే వీలు లేకుండా బ్యాన్ చేసిందంటూ ప్రచారం సాగింది. అయితే, ఇది నిజం కాదని తెలుస్తోంది. టీటీడీ ఎప్పుడూ ఏ శ్రీవారి భక్తుడు, భక్తురాలిపై నిషేధం విధించలేదని... వెంకన్న స్వామి దర్శనం కోసం రావొద్దంటూ ఎవరిపైనా ఆంక్షలు పెట్టలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Continues below advertisement

ఇక టీటీడీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోనూ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ చేశారనే ప్రకటన ఎక్కడా రాలేదని స్పష్టం అవుతోంది. దీంతో శివజ్యోతిని తిరుమలకు రాకుండా బ్యాన్ చేశారంటూ వచ్చిన వార్తలు నిరాధారమైనవని తెలుస్తోంది. మరి దీనిపై కన్ఫ్యూజన్ నెలకొన్న నేపథ్యంలో టీటీడీ అఫీషియల్‌గా అనౌన్స్ చేయాల్సి ఉంది.

Also Read : టీజర్‌లో బూతులు... సాంగ్‌లో కలర్స్ - 'సైక్ సిద్దార్థ' వెరైటీ కలర్ ఫుల్ సాంగ్ లిరిక్స్

అసలేం జరిగిందంటే?

ఇటీవల తిరుమల క్యూలైన్లో అన్న ప్రసాదం తీసుకుంటుండగా... యాంకర్ శివజ్యోతి... 'సోను కాస్ట్‌లీ ప్రసాదంపై అడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్. రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం' అంటూ నవ్వుతూ కామెంట్స్ చేసింది.  ఈ వీడియో వైరల్ కాగా శ్రీవారి భక్తులతో పాటు నెటిజన్లు సైతం ఆమె తీరును తప్పుబట్టారు. శ్రీవారి అన్న ప్రసాదాన్ని అపహాస్యం చేశారంటూ మండిపడ్డారు. తన కామెంట్స్‌పై తీవ్ర విమర్శలు రావడంతో శివజ్యోతి స్పందించారు.

ప్రసాదంపై తాను చేసిన కామెంట్స్ ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించాలంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. 'నా వైపు నుంచి తప్పు జరిగింది. క్యూలైన్లో నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు. 10 వేల L1 క్యూలైన్లో మేము నిలబడ్డప్పుడు కాస్ట్‌లీ లైన్లో నిలబడ్డామనే ఉద్దేశంతే అలా మాట్లాడాను. తప్పు నా తరఫున, నా తమ్ముడు సోను తరఫున జరిగింది కాబట్టి అందరికీ క్షమాపణలు చెబుతున్నాం. వెంకటేశ్వర స్వామి నా జీవితాన్నే మార్చారు. ఈ రోజు నేను అనుభవించే ఏదీ ఆయన దయ లేకుండా రాదు. తెలిసో తెలియకో పొరపాటున ఆ కామెంట్స్ నా నోటి నుంచి వచ్చాయ్. అందుకు సారీ అడుగుతున్నా. ఇంకోసారి ఇలా జరగదు.' అంటూ క్షమాపణలు చెప్పారు.

దీంతో వివాదం సద్దుమణిగిందనే అంతా అనుకున్నారు. కానీ ఆమె ఆధార్ కార్డ్ బ్లాక్ చేశారనే ప్రచారం జరగడం వైరల్‌గా మారింది. తాజాగా అలాంటిదేమీ లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే, సారీ చెప్పిన తర్వాత కూడా ఆమెను ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారంటూ కొందరు నెటిజన్లు నెట్టింట ప్రశ్నిస్తున్నారు.