యూట్యూబ్, ఇండిపెండెంట్ సినిమాలు చూసే ప్రేక్షకులకు బండి సరోజ్ కుమార్ పేరు, ఆయన నటించిన, దర్శకత్వం వహించిన సినిమాలు పరిచయమే. మొదట ఆయన నందమూరి తారక రామారావు, లక్ష్మీ పార్వతిలపై ఓ డాక్యుమెంటరీ తీశారు. ఆ తర్వాత ఇండిపెండెంట్ ఫిలిమ్స్ చేయడం మొదలు పెట్టారు. బండి సరోజ్ కుమార్ కెరీర్ చూస్తే... 


డిజిటల్ మీడియాలో సంచలనం సృష్టించిన 'మాంగల్యం'
బండి సరోజ్ కుమార్ తొలుత 'నిర్బంధం' అని ఓ సినిమా చేశారు. యూట్యూబ్‌లో ఆ చిత్రానికి రెస్పాన్స్ బాగా వచ్చింది. ఆ తర్వాత 'నిర్బంధం 2' చేశారు. దానికీ రెస్పాన్స్ బాగా వచ్చింది. ఆ తర్వాత 'మాంగల్యం' పేరుతో బండి సరోజ్ కుమార్ నటించిన, దర్శకత్వం వహించిన సినిమా సంచలనం సృష్టించింది. సుమారు 16 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఆయన ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నారు.


గల్లీ క్రికెట్ నేపథ్యంలో బండి సరోజ్ కుమార్ 'పరాక్రమం'
Bandi Saroj Kumar New Movie : బండి సరోజ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'పరాక్రమం' (Parakramam Movie). ఐ, మి, మైసెల్ఫ్... అనేది ఉపశీర్షిక. బిఎస్కే మెయిన్ స్ట్రీమ్ పతాకంపై రూపొందుతోంది.


Also Readఊరు పేరు భైరవకోన ఆడియన్స్ రివ్యూ: సందీప్ కిషన్ పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవల్ - మరి సినిమా ఎలా ఉంది?



గల్లీ క్రికెట్ నేపథ్యంలో 'పరాక్రమం' తెరకెక్కించినట్లు బండి సరోజ్ కుమార్ చెప్పారు. ఇందులో హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం, సంగీతం, కూర్పు, రచన, పాటలు, మాటలు,  నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించారు. ఇంతకు ముందు తీసిన సినిమాలను డిజిటల్ మీడియాలో 'వాచ్ అండ్ పే' (డబ్బు కట్టి సినిమా చూసే పద్ధతి) ద్వారా విడుదల చేశారు. 'పరాక్రమం' చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు. వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, త్వరలో టీజర్ & ట్రైలర్ విడుదల తేదీతో పాటు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామన్నారు.


Also Read: భ్రమయుగం ఆడియన్స్ రివ్యూ: మమ్ముట్టి హారర్ థ్రిల్లర్ - బ్లాక్ అండ్ వైట్ సినిమా టాక్ ఎలా ఉందంటే?



యూట్యూబ్ వీడియోలకు సెన్సార్ లేకపోవడంతో డైలాగులు, సన్నివేశాల పరంగా సరోజ్ కుమార్ స్వేచ్ఛ తీసుకున్నారు. తానూ చెప్పాలనుకున్న కథకు ఎటువంటి కత్తెరలు లేకుండా చెప్పారు. 'పరాక్రమం' ఎలా తీశారో చూడాలి. ఇందులో శాస్త్రీయ నృత్య కళాకారిణి శృతి సమన్వి, నాగలక్ష్మి హీరోయిన్లుగా నటించారు. 'పౌర్ణమి', '100 పర్సెంట్ లవ్' ఫేమ్ వెంకట్ ఆర్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. 


బండి సరోజ్ కుమార్ హీరోగా శృతి సమన్వి, నాగలక్ష్మి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మోహన్ సేనాపతి, అనిల్ కుమార్, కిరీటి, శశాంక్ వెన్నెలకంటి, వంశీ రాజ్ నెక్కంటి, నిఖిల్, కృష్ణ వేణి, వసుంధర, అలీషా ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సౌండ్ డిజైన్: కాళీ ఎస్ ఆర్ అశోక్, కళా దర్శకత్వం: ఫణి మూసి, నిర్మాణ సంస్థ: బి.ఎస్.కె మెయిన్ స్ట్రీమ్, నృత్య దర్శకత్వం: రవి శ్రీ, పోరాటాలు: పి రాము, వీఎఫ్ఎక్స్: ఐకెరా స్టూడియోస్, ఛాయాగ్రహణం: వెంకట్ ఆర్ ప్రసాద్, కథ - స్క్రీన్ ప్లే - మాటలు - పాటలు - ఎడిటింగ్ - సంగీతం - నిర్మాణం - దర్శకత్వం: బండి సరోజ్ కుమార్.