Mammootty's Bramayugam movie public talk: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన కొత్త సినిమా 'భ్రమయుగం'. ఆయన 'యాత్ర 2'తో ఫిబ్రవరి 8న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే... 'భ్రమయుగం' మలయాళ సినిమా. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ డబ్బింగ్ చేశారు. తొలుత అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. మాతృక భాషలో... అంటే మలయాళంలో ఈ సినిమా చూస్తే ప్రేక్షకులకు అనుభూతి ఉంటుందని ఇవాళ మలయాళ వెర్షన్ విడుదల చేశారు. కేరళ ప్రేక్షకులు, సినిమా చూసిన వాళ్లు ఏమంటున్నారు? ఈ సినిమాకు సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉంది? అనేది చూడండి. 


మమ్ముట్టి నట విశ్వరూపం'భ్రమయుగం'
సినిమాలో మమ్ముట్టి నట విశ్వరూపం చూపించారని నెటిజనులు పేర్కొంటున్నారు. ఇంతకు ముందు ఆయన చేసిన పాత్రలకు, ఈ సినిమాలో చేసిన పాత్రకు అసలు పోలికలు లేవని, పూర్తి భిన్నమైన పాత్రలో తనలోని కొత్త నటుడిని తెరపైకి తీసుకొచ్చారని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మమ్ముట్టి వరల్డ్ క్లాస్ యాక్టర్ అని, లెజెండ్ అని మరో నెటిజన్ పేర్కొన్నారు. 






'భ్రమయుగం' కథ ఏమిటి? మూవీలో ఏముంది?
'భ్రమయుగం' సినిమా రెండు కాలాల నేపథ్యంలో సాగుతుందని ఆల్రెడీ సినిమా చూసిన జనాలు చెబుతున్నారు. హారర్ నేపథ్యంలో సినిమా తీశారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. అయితే... సినిమాలో అంతకు మించి ట్విస్టులు, టర్నులు ఉన్నాయట. 


కథ విషయానికి వస్తే... ఇందులో కోడుమోన్ పొట్టి పాత్రలో మమ్ముట్టి నటించారు. అనుకోకుండా ఆయన మహల్ లోని  తేవన్ అని నాయకుడు వస్తాడు. అక్కడ ఆ గాయకుడికి ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది సినిమాలో చూడాలి. ఈ హారర్ సినిమాను దర్శకుడు ఆసక్తికరంగా తీశారట. కేవలం హారర్ అంశాలు మాత్రమే కాకుండా కుల వివక్షను సైతం అంతర్లీనంగా టచ్ చేశారట.


Also Readఊరు పేరు భైరవకోన ఆడియన్స్ రివ్యూ: సందీప్ కిషన్ పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవల్ - మరి సినిమా ఎలా ఉంది?


సినిమాలో మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్ నటన అద్భుతమని కేరళ ఆడియన్స్ చెబుతున్నారు. వాళ్ల నటనకు తోడు క్లైమాక్స్ అదిరిందట. దర్శకుడు రాహుల్ సదాశివన్ టేకింగ్ సైతం బావుందని మెచ్చుకుంటున్నారు. 


సోషల్ మీడియాలో 3 ప్లస్ రేటింగ్స్!
'భ్రమయుగం' సినిమాకు సోషల్ మీడియాలో 3 ప్లస్ రేటింగ్స్ వస్తున్నాయి. ఒకరు 3 ఇస్తే... మరొక నెటిజన్ 4/5 రేటింగ్ ఇచ్చారు. మరి, విమర్శకుల నుంచి ఎటువంటి ప్రశంసలు వస్తాయో చూడాలి. తెలుగులో ఈ సినిమా ఫిబ్రవరి 23న విడుదల కానుంది.


Also Readఆశిష్ పెళ్లి - మనవరాలితో దిల్ రాజు డ్యాన్స్, కాబోయే భర్తకు అమ్మాయి ముద్దు!