Viral Videos: డాకు మహారాజ్ కోసం పొట్టేలు బలి, మాన్షన్ హౌస్ మందుతో బాలయ్య కటౌట్‌కు అభిషేకం
Balakrishna fans celebration at Daaku Maharaaj Theatres : బాలకృష్ట లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సినిమా హిట్ కావాలని ఫ్యాన్స్ పొట్టేలు బలిచ్చారు. మాన్షన్ హౌస్ మందుతో బాలయ్య కటౌట్‌కు అభిషేకం చేశారు.

Balakrishnas Fans sacrifice a sheep and a goat to celebrate the release of Daku Maharaj movie
గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్' ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదలైంది. సంక్రాంతి పండుగ కానుకగా నందమూరి ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినీ ప్రేక్షకులను అలరించడానికి బాలయ్య సంక్రాంతి బరిలో దిగారు. అమెరికాలో మంచి టాక్ వస్తోంది. మరోవైపు ఏపీలో బెనిఫిట్ షోలకు థియేటర్ల వద్ద సందడి కనిపించింది. దుమ్మురేపిన డాకు మాహారాజ్ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ కానుంది.
థియేటర్ల వద్ద బాలయ్య ఫ్యాన్స్ అరాచకం
గతంలో కొన్ని సినిమాల విడుదల సందర్బంగా ఫ్యాన్స్ జంతుబలి ఇచ్చి కేసుల్లో ఇరుక్కున్నారు. తాజాగా సంక్రాంతి కానుకగా విడులైన డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ బాలకృష్ణ అభిమానులు ఓ థియేటర్ వద్ద గొర్రె పొట్టేలును బలి ఇచ్చారు. ఆ మూగ జీవాన్ని బలి ఇచ్చిన తరువాత దాని రక్తాని అద్ది డాకు మహారాజ్ పోస్టర్ కు రుద్దుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా హిట్ కావాలని మూగ జీవాలను అలా బలివ్వడం ఏంటని జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఈ పైత్యం మానుకోవాలని టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్‌ను హెచ్చరిస్తున్నారు.
బాలయ్య కటౌట్‌కు మద్యంతో అభిషేకం
రాజకీయ నాయకులు ఏదైనా స్కీమ్ ప్రకటించినా, ఏదైనా వర్గానికి మేలు చేసే నిర్ణయాలు ప్రకటించిన సమయంలో వారికి పాలాభిషేకాలు చేయడం చూస్తుంటాం. అయితే డాకు మహారాజ్ సినిమా విడుదల సందర్భంగా అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ వెరైటీగా మద్యాభిషేకం చేశారు. బాలయ్య ఫెవరెట్ బ్రాండ్ గా ఫేమస్ అయిన మాన్షన్ హౌస్ బాటిల్ మద్యంతో అభిమానులు హీరో బాలకృష్ణ కటౌట్‌కు అభిషేకం చేశారు. ప్లేస్ ఏదైనా, బాలయ్య ఫ్యాన్స్ అంటే దబిదిదిబిడే అంటున్నారు. మరోవైపు డాకు మహారాజ్ ఫస్టాఫ్ సూపర్ అని, సెకండాఫ్ ఓకే అంటున్న ఫ్యాన్స్.. ప్రి క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు.
డాకు మహారాజ్ థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపిస్తోంది. గతంలో వీరసింహారెడ్డి సినిమా విడుదల సమయంలోనూ పొట్టేలు బలి ఇచ్చి రక్తాభిషేకం చేశారు ఫ్యాన్స్. మరోచోట మాన్షన్ హౌస్ మద్యంతో బాలయ్య పోస్టర్‌కు అభిషేకం చేశారు. తాజాగా డాకు మహారాజ్ గ్రాండ్ రిలీజ్ సందర్భంగా అవే సీన్లు కనిపించాయి.
జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేస్తున్నారు. సంక్రాంతి విన్నర్ బాలయ్య అని నో డౌట్ అని చెబుతున్నారు. మరో సంక్రాంతి కానుక సంక్రాంతికి వస్తున్నాం ఇంకా విడుదల కాలేదు. ఆ సినిమా విడుదలయ్యాక సంక్రాంతి విన్నర్, రన్నరప్ ఎవరో తేలనుంది.