నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి'(Bhagavanth Kesari) మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తాజాగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం ఆరు రోజుల్లోనే ఈ ఘనతను సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో బాలయ్య దసరా విన్నర్ గా నిలిచారు. డీటెయిల్స్ లోకి వెళ్తే.. హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ 'భగవంత్ కేసరి'. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో కనిపించింది.


అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాలయ్య మార్క్ యాక్షన్ తోపాటు ఆడపిల్లలు లేడి పిల్లలు కాదు, ప్రపంచం ముందు వాళ్ళు అందరిని ఎదిరించి నిలబడాలి అనే మెసేజ్ ని సమాజానికి తెలిసేలా అనిల్ రావిపూడి తనదైన స్టైల్ లో ఈ సినిమాని తెరకెక్కించారు. ఫ్యాన్స్ కోరుకునే అంశాలతో పాటు సమాజానికి ఉపయోగపడే మెసేజ్ కూడా ఉండడంతో ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి అనూహ్య స్పందన వచ్చింది. ముఖ్యంగా నేలకొండ భగవంత్ కేసరి పాత్రలో బాలయ్య యాక్టింగ్, డైలాగ్స్, అనిల్ రావిపూడి తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.30 కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకుంది.






ఇక రెండో రోజు నుండి కలెక్షన్స్ మరింత పెరగగా కేవలం ఆరు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. మంగళవారం నాటికి ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.104 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ స్వయంగా ప్రకటించింది. ఈ మేరకు రూ.100 కోట్ల పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది. అటు ఓవర్సీస్ లో కూడా వన్ మిలియన్ మార్క్ ని రాబట్టినట్లు మూవీ టీం పేర్కొంది. 'భగవంత్ కేసరి' ఆరు రోజుల్లోనే వందకోట్ల క్లబ్ లో చేరడంతో బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి' తర్వాత బాలకృష్ణ ఖాతాలో మరో రూ.100 కోట్ల మూవీ గా నిలిచింది భగవంత్ కేసరి.


దీంతో 'అసలైన దసరా విన్నర్ మా బాలయ్య' అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. భగవంత్ కేసరి రియల్ బ్లాక్ బస్టర్ అంటూ చెబుతున్నారు. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి హీరోల తర్వాత వరుసగా మూడు సినిమాలతో రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకున్న హీరోగా బాలయ్య నిలిచారు. మరో విశేషమేంటంటే, సీనియర్ హీరోల్లో రూ.100 కోట్ల హ్యాట్రిక్ అందుకున్న ఏకైక హీరో బాలయ్య కావడం విశేషం.


మరి ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్ గా నటించిన ఈ చిత్రంలో తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్, రవిశంకర్, శుభలేఖ సుధాకర్, రాహుల్ రవి, రఘుబాబు, సుబ్బరాజు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.


Also Read : చిరంజీవి కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - అదేంటో తెలుసా?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial