సంక్రాంతి, సమ్మర్ సీజన్ల తర్వాత దసరా పండుగను సినిమాలకు మంచి సీజన్ గా భావిస్తుంటారు. పది రోజుల పాటు సెలవులు వుంటాయి కాబట్టి, వాటిని క్యాష్ చేసుకోవాలని ఫిలిం మేకర్స్ ఆలోచిస్తుంటారు. క్రేజీ సినిమాలను ఆ సమయంలోనే రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తుంటారు. ఎప్పటిలాగే టాలీవుడ్ లో ఈసారి కూడా విజయ దశమికి గట్టి పోటీ నెలకొంది. అక్టోబర్ మూడో వారం కోసం ఇప్పటికే మూడు పెద్ద సినిమాలు ఖర్చీఫ్స్ వేశాయి. వాటిల్లో పాన్ ఇండియా మూవీస్ కూడా ఉండడంతో ఇతర భాషల్లోనూ పోటీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'టైగర్ నాగేశ్వర రావు'. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది రవితేజకు ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. 1970లలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందే ఈ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అయితే రవితేజకి పోటీగా నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా దసరా బరిలో దిగబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'భగవంత్ కేసరి' చిత్రాన్ని 2023 అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఆయుధ పూజ నాడు విడుదలయ్యే ఈ సినిమా శానా ఏండ్లు యాదుంటదని పేర్కొన్నారు. సైన్ స్క్రీన్ బ్యానర్ పై ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీలా, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలలో కనిపించనున్నారు.
Read Also: Most Popular Indian Stars: ఇండియాలోనే మోస్ట్ పాపులర్ స్టార్ ఎవరో తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు!
బాలయ్య కంటే ముందుగా తమిళ హీరో తలపతి విజయ్ కూడా విజయ దశమికి రానున్నట్లు ప్రకటించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లియో' చిత్రాన్ని అక్టోబర్ 19న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇది పాన్ ఇండియా మూవీ. తమిళ్ లోనే కాకుండా మిగతా అన్ని ప్రధాన భాషల్లో రానుంది. తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఇందులో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సంజయ్ దత్, అర్జున్ సర్జా, అనురాగ్ కశ్యప్, మడోన్నా సెబాస్టియన్, ప్రియా ఆనంద్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఉస్తాద్ రామ్ పోతినేని, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'స్కంధ' సినిమాని కూడా దసరా సీజన్ లో థియేటర్స్ లోకి తీసుకురావాలని భావించారు. నిజానికి అందరి కంటే ముందు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది వీరే. అయితే క్లాష్ ని నివారించడానికి సెప్టెంబర్ 15వ తేదీకి ప్రీ పోన్ చేసుకున్నారు. దీంతో చివరికి 'టైగర్ నాగేశ్వరరావు', 'భగవంత్ కేసరి', 'లియో' వంటి మూడు పెద్ద చిత్రాలు బరిలో దిగుతున్నాయి. ఇవి వేటికవే ప్రత్యేకమైన కమర్షియల్ చిత్రాలు. వీటిపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
గతంలో బాలకృష్ణ - రవితేజ నాలుగు సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. 'కృష్ణ' - 'ఒక్కమగాడు', 'మిత్రుడు' -'కిక్', 'పరమవీర చక్ర' - 'మిరపకాయ్', 'వీర' - 'శ్రీరామరాజ్యం' సినిమాలు ఒకే సీజన్ లో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఐదోసారి పోటీ పడబోతున్నారు. అలానే ఈ ఏడాది సంక్రాంతికి విజయ్ 'వారసుడు' - బాలయ్య 'వీర సింహారెడ్డి' సినిమాలు వచ్చాయి. వీరు మళ్లీ దసరాకి రాబోతున్నారు. మరి వీరిలో ఎవరు బాక్సాఫీస్ విన్నర్ గా నిలుస్తారు? మూడింటిలో ఏవేవి ప్రేక్షకులని మెప్పిస్తాయో వేచి చూడాలి.
Read Also: గేట్‌వే ఆఫ్ ఇండియా ముందు లిప్ లాక్‌తో రెచ్చిపోయిన ఎమీ జాక్సన్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial